Entertainment

అల్లు అర్జున్ కూడా అవుట్.. ఆల్ టైం రికార్డు సృష్టించిన ‘హనుమాన్’..!


సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలైన తెలుగు సూపర్ హీరో ఫిల్మ్ ‘హనుమాన్’ బాక్సాఫీస్ దగ్గర సంచలనాలు సృష్టిస్తూనే ఉంది. 18 రోజుల్లోనే వరల్డ్ వైడ్ గా రూ.265 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టి ఇప్పటికే పలు రికార్డులు సృష్టించింది. తెలుగు సినిమా చరిత్రలో అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రంగా టాప్-10లో నిలవడమే కాకుండా.. సంక్రాంతి సీజన్ పరంగా ఆల్ టైం రికార్డు క్రియేట్ చేసింది.

టాలీవుడ్ కి సంక్రాంతి సీజన్ ఎంతో కీలకం. బడా బడా స్టార్లు సైతం ఆ సీజన్ లో తమ సినిమాలను విడుదల చేసి రికార్డులు సృష్టించాలి అనుకుంటారు. అలాంటిది కుర్ర హీరో తేజ సజ్జా నటించిన ‘హనుమాన్’.. సంక్రాంతి సీజన్ పరంగా సరికొత్త బెంచ్ మార్క్ సెట్ చేసింది. సంక్రాంతి సీజన్ లో విడుదలై అత్యధిక వసూళ్లు రాబట్టిన సినిమాగా రూ.260 కోట్ల గ్రాస్ తో ఇప్పటిదాకా ‘అల వైకుంఠపురములో’ టాప్ లో ఉండగా.. ఇప్పుడు దానిని ‘హనుమాన్’ బీట్ చేసింది. స్టార్స్ ని సైతం వెనక్కి నెట్టి సంక్రాంతి సీజన్ పరంగా ‘హనుమాన్’ ఆల్ టైం రికార్డు సృష్టించడం హాట్ టాపిక్ గా మారింది.

టాలీవుడ్ టాప్ గ్రాసర్స్ లిస్టులో కూడా హనుమాన్ ఎనిమిదవ స్థానంలో నిలిచింది. మొదటి ఏడు స్థానాల్లో ‘బాహుబలి-2’, ‘ఆర్ఆర్ఆర్’, ‘సలార్’, ‘బాహుబలి-1’, ‘సాహో’, ‘పుష్ప-1’, ‘ఆదిపురుష్’ ఉన్నాయి. ఇప్పటికే రూ.265 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టి బడా స్టార్ల సినిమాల సరసన నిలిచిన ‘హనుమాన్’.. ఫుల్ రన్ లో రూ.300 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టి మరిన్ని రికార్డులు సృష్టించే అవకాశముంది.



Source link

Related posts

locked off with sunny leone a new program started by sunny leone

Oknews

తెలంగాణ సీఎం అభ్యర్థి సినిమా

Oknews

Legendary actor Soumitra Chatterjee passes away at 85

Oknews

Leave a Comment