అల్లు అర్జున్ పుష్ప ద రూల్ కి షార్ట్ బ్రేకిచ్చి తన భార్య పిల్లలతో కలిసి దుబాయ్ ట్రిప్ వేసాడు. తనకి సమయం చిక్కినప్పుడల్లా అల్లు అర్జున్ ఫ్యామిలీతో కలిసి వెకేషన్స్ కి వెళుతూ ఉంటాడు. అలానే ఈసారి అల్లు అర్జున్ తన భార్య స్నేహ, పిల్లలు ఆయన్, అర్హలతో కలిసి దుబాయ్ వెళ్లి అక్కడ ఎంజాయ్ చేస్తున్నాడు. అయితే అల్లు అర్జు దుబాయ్ వెళ్లడం వెనుక మరొక సీక్రెట్ దాగుంది. అది ఇప్పుడు బయటపడింది.
అక్కడ దుబాయ్ లో అల్లు అర్జు మైనపు విగ్రహావిష్కరణ జరగబోతుంది. ఈ నెల 28 అంటే గురువారం సాయంత్రం అల్లు అర్జున్ మైనపు విగ్రహావిష్కరణ దుబాయ్ లో నిర్వహించబోతున్నారు. దాని కోసమే అల్లు అర్జున్ ఫ్యామిలీతో కలిసి దుబాయ్ వెళ్లినప్పటికీ ఫ్యామిలీకి కూడా కాస్త టైమ్ కేటాయించి అక్కడ పిల్లలతో సరదాగా సేదతీరుతున్నాడట.
దుబాయ్ లో జరగబోయే మైనపు విగ్రహావిష్కరణకు అల్లు అర్జున్ స్పెషల్ గెస్ట్ గా హాజరవబోతున్నాడు. తన మైనపు విగ్రహం పక్కనే అల్లు అర్జున్ ఫోటోలు కూడా దిగబోతున్నాడు. అదన్నమాట అల్లు అర్జున్ దుబాయ్ ట్రిప్ వెనుకున్న సీక్రెట్.