ఓ సినిమాకి ఇంత గడ్డుకాలమా అనేలా సాగుతుంది. ఏ ఓటీటీ సంస్థ ఆ సినిమాని స్ట్రీమింగ్ చేయడానికి ముందుకు రావడం లేదు. అసలేంటి ఆ సినిమా? ఎందుకు ఏ ఓటీటీ వేదిక ముందుకు రావడం లేదో ఓసారి చూసేద్దాం.
ది బ్రిటెల్ థ్రెడ్ ( The Brittle Thread) .. జీనీ బీని చడారియా అనేది ట్యాగ్ లైన్. రితేశ్ శర్మ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మేఘ మాథుర్, ముజఫర్ ఖాన్, శివన్ స్పెక్టర్ ప్రధాన పాత్రల్లో నటించారు. వారణాసి ప్రాంతంలోని ప్రజల జీవనశైలి, అక్కడి పరిస్థితులు, సంప్రదాయాల ఆధారంగా ఈ మూవీని తెరకెక్కించారు. అయితే కొన్ని పరిస్థితుల వల్ల అక్కడ లోకల్ గా ఉండే రెండు వర్గాల మధ్య గొడవలు జరుగుతాయి. అయితే ఈ గొడవలు, అల్లర్లు కొంతమంది రాజకీయ నాయకులకు లింకప్ అయ్యేలా ఉన్నాయని ఓటీటీ సంస్థలు భావించాయి. ఒకవేళ ఈ సినిమాని ఓటీటీలోకి తీసుకుంటే ఆ సంస్థకి నష్టం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టున్నాయి. అందుకేనేమో రిలీజ్ చేయడానికి ఏ ఓటీటీ వేదిక ముందుకు రావడం లేదు. 2021 నుండి జాతీయ, అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్ లో ఎన్నో అవార్డులు గెలుచుకున్న ఈ సినిమా అటు థియేటర్లలో, ఇటు ఓటీటీలో రిలీజ్ అవ్వలేదు.
ఈ మూవీ దర్శకుడు ట్విట్టర్ వేదికగా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. ఇది నేను ఊహించిందే.. రాజకీయాలతో ముడిపడి ఉన్న సినిమాని కొనే సాహసం తాము చేయలేమని ఓటీటీలు చెబుతున్నాయని రితీశ్ శర్మ తన అకౌంట్ లో ట్వీట్ చేశాడు. ఇక ఈ ట్వీట్ చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు. సినిమాకి సపోర్ట్ చేయండి అంటూ కామెంట్లు చేస్తున్నారు.