Health Care

అసలే ఎండా కాలం.. మొక్కల విషయంలో ఈ జాగ్రత్తలు తప్పనిసరి!


దిశ, ఫీచర్స్ : మొక్కలు అంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది. అవి కూడా ఓ పసి ప్రాణం లాంటివే అందుకే వాటిని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి అని చెబుతారు మన పెద్దవారు. ఇక ఇంట్లో మొక్కలు పెంచుకోవడం వలన ఇంటికి అందం రావడం అవి మనకు ఫలాలను,పూలను,వృక్షాలుగా ఎదిగితే నీడను ఇస్తాయి. కాబట్టి వాటిని జాగ్రత్తగా చూసుకునే బాధ్యత ప్రతి ఒక్కరిమీద ఉంటుంది.

ప్రస్తుతం మండుటెండలు దంచికొడుతున్నాయి. ఎండ వేడికి ప్రజలు సైతం అల్లాటి పోతున్నారు.అంతే కాకుండా స్టూడెంట్స్‌కు ఎక్జామ్స్ కూడా అయిపోవడంతో అందరూ సెలవులకు ఊరు వెళ్లడానికి ప్రయత్నిస్తారు. మరి మనతో, మన ఇంట్లో పెరిగే మొక్కల సంగతి ఏంటీ? ఈ ఎండా కాలంలో వాటిని ఎలా చూసుకోవాలి. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం.

  • సమ్మర్‌లో మొక్కలపై ప్రత్యేక శ్రద్ధ చూపాలి. కనీసం రోజు ఉదయం 10లోపు, సాయంత్రం 6 తర్వాత వాటికి నీరుని అందించడం ద్వారా వాడి పోకుండా ఉంటాయి.
  • ఇప్పుడు మొక్కల కుండీలను మార్చడం లాంటిది అస్సలే చేయకూడదు. ఆకులను కత్తిరిచడం లాంటివి అస్సలే చేయకూడదు. కొన్ని చోట్లు మొక్కలు గోధమ రంగులోకి మారుతుంటాయి. అలాంటి సమయంలో పేడ, కుళ్లిన ఆకుల ఎరువు వంటివి వేసి రోజూ నీరు పోస్తూ.. ఆ మట్టిని తడుపుతూ ఉండాలి. దాని వలన మొక్కలు పచ్చరంగులోకి మారి, ఆరోగ్యంగా ఉంటాయి.
  • ఒక పాత్రలో నీటిని పోసి నూలు వస్త్రాన్ని తాడులా చేసి ఒక చివరను నీటి పాత్రలో, మరొక చివరను మొక్క మొదట్లో ఉండేటట్లు అమర్చాలి. నీటి పాత్ర నుంచి మొక్క పాదులోకి నూలు వస్త్రం తాడు సాయంతో తేమ అందుతూ ఉంటుంది.
  • అలాగే ప్లాస్టిక్ వాటర్ బాటిల్ లాంటి దాంట్లో నీరు పోసి, రెండు మొక్కల మధ్య దానిని పెట్టి, చిన్న చిన్న హోల్స్ చేయాలి. అది డ్రాప్స్ డ్సాప్స్‌గా నీటిని మొక్కలపై వేసేలా చేయాలి. దీని వలన మొక్కల మొదట్లో తడి ఆరిపోకుండా ఉండి. తేమగా ఉంటుంది.
  • ఇంట్లో వెడల్పు తొట్టె ఉంటే ఆ తొట్టెలో నీటిని నింపి అందులో కుండీలను ఉంచాలి. దీని వల్ల మొక్కలు తేమ కోల్పోకుండా ఉంటాయి.
  • మొక్కల కుండీలను ఎక్కు సూర్యర్శి తాకే ప్రదేశంలో ఉంచకూడదు. మధ్యాహ్నం అయ్యిందంటే వాటిని ఆ ప్రేదశం నుంచి మార్చి, మరొక చోట పెట్టాలి. 4 తర్వాత దాని స్థానంలో దాన్ని పెట్టాలి. దీని వలన మొక్కలు త్వరగా ఆరిపోకుండా ఉంటాయి.
  • నేలపై ఉండే మొక్కల్లో ఆవు పేడ, ఎర్ర మట్టి లాంటివి మొక్కల మొదట్లో వేసి ఎక్కువ మొతాదులో రోజూ నీరు పోయాలి. దీని వలన మొక్కలు ఎండ వేడిని తట్టుకొని పచ్చగా, ఆరోగ్యంగా ఉంటాయి.



Source link

Related posts

మొబైల్ ఫోన్ నీళ్లలో పడి తడిసిందా.. ఇలా ఆరబెడితే సరే..

Oknews

చనిపోయిన వారికి RIP అని ఎందుకు పెడతారో తెలుసా.. అసలు ఈ పదం ఎక్కడ నుంచి వచ్చిందంటే!

Oknews

సంవత్సరం లోపు పిల్లల ఆహారం విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే!

Oknews

Leave a Comment