దిశ, ఫీచర్స్ : ప్రస్తుతం రాష్ట్రంలో రోజూ వర్షం పడుతున్న విషయం తెలిసిందే. అయితే ఎంత వర్షం పడినా మనం మన జాబ్ కోసం లేదా ఏదైనా పని మీద తప్పకుండా బయటకు వెళ్తాం. అయితే చాలా మంది వర్షంలో బయటకు వెళ్లినప్పుడు తమ స్మార్ట్ ఫోన్‌ను జాగ్రత్తగా చూసుకుంటారు. తాము తడిచినా మంచిదే కానీ, ఫోన్ మాత్రం తడవకూడదు అనుకుంటారు. కానీ కొన్ని సందర్భాల్లో మనకు తెలియకుండానే, ఫోన్‌లోకి వాటర్ వెళ్తాయి. మొబైల్ స్పీకర్‌లెరి వాటర్ వెళ్లడ జరుగుతుంది. ఇంకొన్ని సందర్భాల్లో పొలం పనులు చేస్తున్నప్పుడు ఫోన్ నీళ్లల్లో పడటం లేదా, చిన్నపిల్లలు ఫోన్‌ను తెలియకుండా నీళ్లలో పడేయడం జరగుతుంది. దీంతో మొబైల్ స్పీక్ హోల్స్‌లోకివాటర్ వెళ్తాయి. దీంతో వాయిస్ వినబడకపోవడం, సాంగ్స్ , ఆడియో వినబడదు. దీంతో మీరు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. అితే అప్పుడు మనం ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ఏ మొబైల్‌లోకి వాటర్ వెళ్లాయో, ఆ మొబైల్‌లో గూగుల్‌కి వెళ్లి, ఇట్స్ మై స్పీకర్ అని సెర్చ్ చేయాలి. ఫస్ట్ వచ్చిన వెబ్ సైట్ మీద క్లిక్ చేయాలి. దీంతో మీకు ఒక స్పీకర్ సింబల్ కనిపిస్తుంది. దీంతో మీరు దాని మీద ప్రెస్ చేయాలి. మీరు ప్రెస్ చేయగానే లౌడ్‌గా సౌండ్ వస్తుంది. దీంతో అక్కడి నుంచి వచ్చే సౌండ్‌కు మీ మొబైల్‌లో ఉన్న వాటర్ అన్నీ బయటకు వచ్చేస్తాయి. దీంతో ఎలాంటి ఇబ్బంది లేకుండా మీ వినబడుతుంది.(నోట్ : ఇది ఇంటర్నెట్‌లోని సమాచారం మేరకు మాత్రమే ఇవ్వబడినది, దిశ దీనిని ధృవీకరించలేదు)