తమిళ సూపర్ స్టార్ ధనుష్ కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు. విభిమన్నమైన సినిమాల్లో నటిస్తు ఇతర హీరోలకి సైతం ఇన్స్పిరేషన్ గా నిలుస్తాడు. ఇటీవల కెప్టెన్ మిల్లర్ తో వచ్చిన ఆయన రాయన్ అనే మరో డిఫరెంట్ మూవీతో రాబోతున్నాడు. షూటింగ్ దశలో ఉన్న ఈ మూవీకి ధనుష్ నే దర్శకత్వాన్ని వహిస్తున్నాడు.దీంతో రాయన్ క్రేజీ ప్రాజెక్ట్ గా మారింది. ఈ క్రమంలో ధనుష్ తాజాగా చేసిన ట్వీట్ ఇప్పుడు టాక్ ఆఫ్ ది కోలీవుడ్ గా మారింది.
ధనుష్ 50 వ చిత్రంగా రాయన్ రూపొందుతుంది. సూపర్ హిట్ చిత్రాల దర్శకుడు సెల్వ రాఘవన్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇప్పుడు ఈ విషయంపైనే ధనుష్ సెల్వ రాఘవన్ లుక్ ని విడుదల చేస్తు తన మనసులోని మాటని చెప్పాడు. మిమ్మల్ని డైరెక్ట్ చేస్తానని కలలో కూడా ఊహించలేదని ట్విట్టర్ వేదికగా చెప్పాడు. ఇప్పుడు ఇది వైరల్ గా మారింది. ఎందుకంటే సెల్వ రాఘవన్ స్వయంగా ధనుష్ కి అన్నయ్యే.ఇద్దరి మధ్యన ఎంతో అన్యోన్యత్వం ఉంది. ఇక సెల్వరాఘవన్ లుక్ కూడా చాలా బాగుంది. సినిమాపై అంచనాలని కూడా పెంచింది.
ఇక రాయన్ టైటిల్ తో పాటు ధనుష్ ఫస్ట్ లుక్ పోస్టర్ ని రిలీజ్ చేసినప్పుడు కూడా ఆడియెన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఎస్.జే. సూర్య, సందీప్ కిషన్, కాళిదాస్, జయరామ్ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ మూవీకి ఏఆర్ రెహమాన్ సంగీతాన్ని అందిస్తున్నాడు. మిగతా నటినటుల విషయాలు త్వరలోనే వెల్లడి కానున్నాయి. సన్ పిక్చర్స్ రాయన్ ని నిర్మిస్తుంది