అసలే మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్.. దానికి తోడు తన మ్యూజిక్ తో మాస్ ని ఉర్రుతలూగించే మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్. ఈ ఇద్దరు కలిస్తే ఇంకేమైనా ఉందా?. అందుకే ఈ ఇద్దరి కలయికలో వస్తున్న ‘దేవర’ కోసం ప్రేక్షకులు ఎంతగానో వెయిట్ చేస్తున్నారు. ఈ మూవీ సాంగ్స్ చార్ట్ బస్టర్స్ గా నిలవడం ఖాయమనే అంచనాలున్నాయి. అందుకే దేవర సాంగ్స్ ఎప్పుడెప్పుడు విడుదలవుతాయా అని వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు అభిమానులు. అయితే ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించిన ఒక సాంగ్ అప్డేట్ సోషల్ మీడియాని షేక్ చేస్తోంది.
జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతోన్న పాన్ ఇండియా మూవీ ‘దేవర’. యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీ రెండు భాగాలుగా రానుంది. మొదటి భాగం దసరా కానుకగా అక్టోబర్ 10న విడుదల కానుంది. అయితే దసరా అనగానే మనకు ముందుగా గుర్తుకొచ్చేది ఆయుధ పూజ. దేవరలో కూడా ‘ఆయుధ పూజ’ సాంగ్ ఉందట. ఇప్పటికే సాంగ్ రికార్డింగ్ పూర్తి అయిందని, అనిరుధ్ మ్యూజిక్ గూస్ బంప్స్ తెప్పించేలా ఉందని అంటున్నారు. ఈ సాంగ్ చిత్రీకరణను కూడా ఒక రేంజ్ లో ప్లాన్ చేస్తున్నారట. దేవాలయం దగ్గర రూపొందించే ఈ ‘ఆయుధ పూజ’ సాంగ్ లో ఎన్టీఆర్ నట విశ్వరూపం చూడబోతున్నమాట. ఈ సాంగ్ సినిమాలోనే హైలెట్ గా నిలవనుందని చెబుతున్నారు. త్వరలోనే ఈ పాట చితీకరణ జరిగే అవకాశముందని తెలుస్తోంది.
ఎన్టీఆర్ తన స్క్రీన్ ప్రజెన్స్ తో మాస్ కి పూనకాలు తెప్పించగలడు. అలాంటి ఎన్టీఆర్ కి అనిరుధ్ మ్యూజిక్ తోడైతే ఎలా ఉంటుందో ‘ఆయుధ పూజ’ సాంగ్ లో చూడబోతున్నామని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.
దేవరలో ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ చేస్తున్నట్లు సమాచారం. జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో సైఫ్ అలీ ఖాన్ విలన్ గా నటిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ కి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా మే 20న టీజర్ విడుదలయ్యే అవకాశముంది.