GossipsLatest News

ఆరింటిలో ఒక్కచోటైనా కమలం వికసించేనా?


ఏపీలో ఎన్నికలకు సమయం ఆసన్నమైంది. గెలుపోటములపై జనాల్లో పెద్దగా ఆసక్తి లేదు. ఎందుకంటే దాదాపు వార్ వన్‌ సైడేనని ఇటీవలి పరిణామాలు చెప్పకనే చెబుతున్నాయి. పరిస్థితులన్నీ సీఎం జగన్‌కు వ్యతిరేకంగానే ఉన్నాయి. ఇక విజయావకాశాలు ఎక్కువగా ఉన్న టీడీపీ, జనసేనలు బీజేపీ కోసం పాకులాడాయి. అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పట్టుబట్టి మరీ బీజేపీని తమ కూటమిలో చేర్చుకున్నారు. దీనికోసం సీట్లను త్యాగం చేసేందుకు సైతం ఇరు పార్టీలు వెనుకాడలేదు. మరి అంతలా ఇబ్బంది పడి మరీ ఏరి కోరి తెచ్చుకున్న పార్టీ వలన లాభం ఏమైనా ఉంటుందా? సీట్లు అయితే కట్టబెట్టారు కానీ ఆయా సీట్లలో బీజేపీ విజయం సాధిస్తుందా? అనేది చర్చనీయాంశంగా మారింది.

బీజేపీకి కేడర్ నిల్..

ఇక బీజేపీకి అసెంబ్లీ సీట్లు విషయంలో క్లారిటీ రాలేదు. ఇవాళో, రేపో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇక ఎంపీ సీట్ల విషయంలో అయితే క్లారిటీ వచ్చినట్టుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే బీజేపీ ఎంపీ అభ్యర్థులను సైతం ఫిక్స్ చేసేసినట్టుగా సమాచారం. ఈ క్రమంలోనే ఆరుగురు అభ్యర్థుల లిస్ట్ ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఆరుగురు అభ్యర్థులనైతే బీజేపీ దాదాపు ఫిక్స్ చేసింది కానీ దానిలో ఒక్కరైనా గెలుస్తారా? అనేది ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే ఏపీలో బీజేపీకి ఏమాత్రం కేడర్‌ లేదు. గత ఎన్నికల్లో ఓటింగ్ శాతాన్ని పరిశీలించినా కానీ బీజేపీ లీస్ట్‌లో ఉంది. కాంగ్రెస్, ఇతరుల కంటే కూడా బీజేపీ ఓటింగ్ శాతమే తక్కువ. టీడీపీ, జనసేనలు కలిసినా కూడా అభ్యర్థి బీజేపీ వాడైతే విజయం కష్టమేనని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

ఎన్నికల లోపు పరిస్థితులు మారుతాయా?

బీజేపీపై ఏపీలో పెద్ద ఎత్తున వ్యతిరేకత ఉంది. ఒంటరిగా బరిలోకి దిగితే డిపాజిట్లు రావడం కూడా కష్టమే. ఇప్పుడు టీడీపీ, జనసేన అండ ఉంది కాబట్టి డిపాజిట్లకు ఢోకా ఏమీ లేదు కానీ గెలవడమే సందేహంగా మారింది. ఇప్పుడు బీజేపీ అభ్యర్థులు గెలవకుంటే అది టీడీపీ, జనసేనలకు నష్టాన్ని.. వైసీపీకి లాభాన్ని తెచ్చిపెడుతుంది. అయితే గతంలోనూ అంటే 2014లో ఇలా గెలవదనుకుంటేనే కొన్ని స్థానాలను గెలుచుకుంది. తెలంగాణలోనూ బీజేపీ పని అయిపోయిందనుకుంటే.. అక్కడ ఏకంగా 8 స్థానాలను కైవసం చేసుకుంది. ఓటింగ్ పర్సంటేజ్‌ను కూడా పెంచుకుంది. ఈసారి ఏపీ ఎన్నికల్లోనూ ఇలాగే జరిగే అవకాశం ఉందని కొందరు అంటున్నారు. ఇక బీజేపీ తరుఫున పోటీ చేయనున్న ఎంపీ అభ్యర్థులు వీరేనంటూ ఓ లిస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఆదివారం బీజేపీ  సెంట్రల్ ఎలక్షన్ కమిటీ భేటీ అయిన తర్వాత ఏపీ అభ్యర్థులను కూడా ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది.

ఏపీ బీజేపీ ఎంపీ అభ్యర్థుల ప్రాబబుల్స్ 

1) అరకు –  కొత్తపల్లి గీత

2) అనకాపల్లి  –  సీఎం రమేష్

3) రాజమండ్రి  – పురందేశ్వరి  

4) రాజంపేట – కిరణ్ కుమార్ రెడ్డి లేదా సాయి లోకేష్

5) హిందూపూర్ – సత్య కుమార్  లేదా పరిపూర్ణనంద స్వామీ

6)  ఏలూరు – సుజనా చౌదరి లేదా తపనా చౌదరి



Source link

Related posts

శోభన్‌బాబుని చూసి కన్నీళ్లు పెట్టుకున్న హీరోయిన్‌!

Oknews

Bharat Ratna To PV Narasimha Rao | Bharat Ratna To PV Narasimha Rao | కాంగ్రెస్ అలా..బీజేపీ ఇలా.. పీవీ మనవడి షాకింగ్ ఆన్సర్స్

Oknews

రెండు నెలల పాటు రామ్ చరణ్ అక్కడే..హెల్త్ జాగ్రత్త అంటున్న ఫ్యాన్స్

Oknews

Leave a Comment