EntertainmentLatest News

ఆర్ఆర్ఆర్ కి మూడు లక్షలు ఇచ్చిన రావు రమేష్ 


రావు రమేష్(rao ramesh).తన తండ్రి స్వర్గీయ  నట విరాట్ రావు గోపాల్ రావు (rao gopalarao)ని ఇనిస్పిరేషన్ గా తీసుకొని 2002 లో బాలకృష్ణ హీరోగా వచ్చిన సీమసింహం ద్వారా సినీ రంగ ప్రవేశం చేసాడు. అడ్డాల శ్రీకాంత్ కొత్త బంగారు లోకంతో రావు గోపాలరావు గారి నట వారసత్వాన్ని నిలబెట్టడానికి వచ్చాడనే విషయం అందరికి అర్ధమయ్యింది.కిక్ ,మగధీర, ఖలేజా, అత్తారింటికి దారేది, దువ్వాడ జగన్నాధం, ముకుంద, లీడర్, గబ్బర్ సింగ్, లెజండ్, హైపర్, ఓ బేబీ, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, ఇద్దరు అమ్మాయిలతో, సినిమా చూపిస్తా మావ,  పుష్ప  ఇలా ఎన్నో సినిమాల్లో అద్భుతమైన పాత్రలు పోషించాడు. సరికొత్త డైలాగ్ 

డెలివరీ తో  తండ్రికి తగ్గ తనయుడు అని కూడా అనిపించుకున్నాడు.లేటెస్ట్ గా ఆయనకి సంబంధించిన ఒక  న్యూస్ టాక్ అఫ్ ది డే గా నిలిచింది

 ఆంధ్రప్రదేశ్ లోని పశ్చిమ గోదావరి జిల్లా ఉండి (undi)నియోజక వర్గానికి ప్రత్యేక స్థానం ఉంది.ప్రకృతి రమణీయత మధ్య ఎప్పటికప్పుడు నూతన సొగసుల్ని అద్దుకున్నట్టుగా ఉంటుంది. ఇప్పుడు ఈ నియోజక వర్గానికి  రావు రమేష్ మూడు లక్షల రూపాయలని విరాళంగా  ఇచ్చాడు. ఉండి తెలుగుదేశం ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజు(raghu rama krishnam raju) గారిని కలిసి   చెక్కు రూపంలో ఆ మొత్తాన్ని అందించాడు. నియోజకవర్గంలోని  డ్రైనేజీ పనులతో  పాటు నియోజకవర్గ అభివృద్ధి పనులకు  ఆ మొత్తాన్ని ఉపయోగించనున్నారు.ఇక సినిమాల పరంగా చూసుకుంటే రావు రమేష్ ప్రస్తుతం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా వస్తున్న పుష్ప 2  తో పాటు రజనీ కాంత్ వేట్టియన్ చేస్తున్నాడు. రెండు చిత్రాల్లోను కీలక పాత్రలే పోషిస్తున్నాడు. 

 



Source link

Related posts

మహేష్ బాబు  డాన్స్ అంటే పిచ్చి..మగధీర చూసా కదా

Oknews

నిత్యా మీనన్‌ పెళ్ళి… సెక్యూరిటీ అవసరం లేదట!

Oknews

భార్యతో కలిసి విదేశాలకు పవన్ కళ్యాణ్.. ఎందుకో తెలుసా?

Oknews

Leave a Comment