EntertainmentLatest News

‘ఆర్‌ఆర్‌ఆర్‌’ తర్వాత ఎన్టీఆర్‌ నుంచి వచ్చే సినిమా ‘దేవర’ కాదా?


ఇప్పుడు టాలీవుడ్‌లో ఇంట్రెస్టింగ్‌ టాపిక్‌ ఏది అంటే.. యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ బాలీవుడ్‌ ఎంట్రీ. దీని గురించి ఎన్నో వార్తలు వచ్చాయి. ఫైనల్‌గా 2019లో హృతిక్‌ రోషన్‌, టైగర్‌ ష్రాప్‌ కాంబినేషన్‌లో వచ్చిన ‘వార్‌’ చిత్రానికి సీక్వెల్‌గా రూపొందే ‘వార్‌2’ ద్వారా ఎన్టీఆర్‌ బాలీవుడ్‌ ఎంట్రీ ఇస్తాడని ఖరారైంది. ఇప్పటికే ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రంలోని తన నటనతో నార్త్‌ ఆడియన్స్‌ని సైతం బుట్టలో వేసుకున్న ఎన్టీఆర్‌ ఇప్పుడు ‘వార్‌2’తో వారికి మరింత దగ్గరవుతాడని అందరూ భావిస్తున్నారు. 

ఎన్టీఆర్‌ బాలీవుడ్‌ ఎంట్రీకి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్‌ న్యూస్‌ బాలీవుడ్‌లో, టాలీవుడ్‌లో డిస్కషన్‌ పాయింట్‌ అయింది. అదేమిటంటే ఎన్టీఆర్‌ బాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చేది ‘వార్‌2’తో కాదు అనేది ఆ వార్త. అంతకంటే ముందే బాలీవుడ్‌లో ఎంటర్‌ అవ్వబోతున్నాడు యంగ్‌ టైగర్‌. ఇప్పటికే బాలీవుడ్‌ సినీ వర్గాల్లో ఎన్టీఆర్‌ పేరు చక్కర్లు కొడుతోంది. బాలీవుడ్‌ నిర్మాతలు కూడా ఎన్టీఆర్‌తో సినిమాలు తీసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఆ క్రమంలోనే ‘వార్‌ 2’ తెరపైకి వచ్చింది. ఈ చిత్రాన్ని యశ్‌రాజ్‌ ఫిలింస్‌ నిర్మించనుంది.

అయితే ఈ సినిమా కంటే ముందే ‘టైగర్‌ 3’ చిత్రంలో ఎన్టీఆర్‌ కనిపించబోతున్నాడు. సల్మాన్‌ ఖాన్‌ హీరోగా వచ్చిన ‘టైగర్‌ జిందా హై’ చిత్రానికి సీక్వెల్‌గా వస్తున్న సినిమా ‘టైగర్‌ 3’. ఈ సినిమా క్లైమాక్స్‌లో ఎన్టీఆర్‌ ఇంట్రడక్షన్‌ సీన్‌ ఉంటుందట. ఎన్టీఆర్‌ పాత్రను ఈ సినిమాలో పరిచయం చేయడం వల్ల ‘వార్‌ 2’లో అతని పాత్రను కీలకంగా మార్చేందుకు వీలుంటుందని మేకర్స్‌ అభిప్రాయం. 

ఇదిలా ఉంటే ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమా రిలీజ్‌ అయి ఏడాదిన్నర అవుతోంది. ఇప్పటివరకు మరో ఎన్టీఆర్‌ సినిమా రాలేదు. కొరటాల శివ కాంబినేషన్‌లో ఎన్టీఆర్‌ చేస్తున్న ‘దేవర’ కోసం అందరూ ఎదురుచూస్తున్నారు. కానీ, అంతకంటే ముందే నవంబర్‌ 10న ‘టైగర్‌ 3’ రిలీజ్‌ కాబోతోంది. అయితే ఈ సినిమాలో ఎన్టీఆర్‌ ఇంట్రడక్షన్‌ వుంటుందన్న వార్తకు సంబంధించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. 



Source link

Related posts

గుంటూరు కారం ఘాటు ఎక్కువేనంట.. 

Oknews

IPS ఆఫీసర్ల గెట్ టు గెదర్ లో సీఎం రేవంత్ రెడ్డి

Oknews

అల్లు అర్జున్‌ దుబాయ్‌ వెళ్ళింది అందుకేనా.. వెరీ ఇంట్రెస్టింగ్‌!

Oknews

Leave a Comment