EntertainmentLatest News

ఆర్జీవీ కన్ను ఆ అమ్మాయిపై పడిరదా.. ఇక అంతే! అంటున్న నెటిజన్లు


రామ్‌గోపాల్‌వర్మ ఏం చేసినా సంచలనమే. ఒక కామెంట్‌ చేసినా, ఒక ట్వీట్‌ పెట్టినా, ఒక ఫోటో పెట్టినా.. దేనికైనా మేం రెడీ అంటూ నెటిజన్లు తయారవుతారు. ఇప్పుడు మళ్ళీ వార్తల్లోకి వచ్చాడు ఆర్జీవీ. ట్విట్టర్‌లో ఓ అమ్మాయి వీడియో పెట్టి.. ఈ అమ్మాయి ఎవరో తెలిస్తే చెప్పండి.. అంటూ ట్వీట్‌ చేశాడు. దీంతో ఈ ట్వీట్‌పై నెటిజన్లు కామెంట్‌ మొదలు పెట్టారు. ‘ఆర్జీవీ కన్ను ఈ అమ్మాయిపై పడిరదా?, వర్మా.. ఆ అమ్మాయి పని అంతే.. ఆ అమ్మాయిని వదిలెయ్‌ అంటూ కొందరు ఫన్నీగా, కొందరు నెగెటివ్‌గా స్పందిస్తున్నారు.

అసలు ఆ అమ్మాయి గురించి ఆర్జీవీ ఎందుకు ఎంక్వయిరీ చేస్తున్నట్టు? తన సినిమాలో నటించే అవకాశం ఇస్తాడా? ఆమెపై ఎందుకు మనసు పారేసుకున్నాడు? అనే ప్రశ్నలు నెటిజన్లలో మొదలయ్యాయి. ఇక ఆర్జీవీ అడగడమే ఆలస్యం ఆ అమ్మాయి ఎవరో కనుక్కొని ఆమె ఇన్‌స్టా ఎకౌంట్‌, ఆమె పేరును ఆర్జీవీకి పంపించేశారు. ఆ అమ్మాయి పేరు శ్రీలక్ష్మీ సతీష్‌.

ఆర్జీవీ పెట్టిన ట్వీట్‌ ఆమె చూసినట్టుంది. ఎంతో సంబరపడిపోయి తన ఇన్‌స్టా స్టోరీలో ఆర్జీవీ వేసిన ట్వీట్‌ స్క్రీన్‌ షాట్‌ను పెట్టేసింది. దీంతో ఆమెకు ఫాలోవర్లు అమాంతం పెరిగిపోయారు. తను ఆర్జీవీ దృష్టిలో పడడంతో ఆమె ఆనందానికి హద్దులు లేనట్టుగా ఉంది. త్వరలోనే ఈ బ్యూటీ వర్మను కలిసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ మలయాళ బ్యూటీ త్వరలోనే హీరోయిన్‌గా తెలుగు సినిమాలో కనిపించే ఛాన్స్‌ ఉందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఇంతకుముందు  శ్రీరాపాక, అరియానా, అషూ రెడ్డి, అప్సరా రాణి, నైనా గంగూలి వంటి హీరోయిన్లు రామ్‌గోపాల్‌వర్మ పుణ్యమా అని లైమ్‌లైట్‌లోకి వచ్చారు. ఇప్పుడు కొత్తగా శ్రీలక్ష్మీ సతీష్‌ పేరు వినిపిస్తోంది. మరి ఈ బ్యూటీని కూడా వర్మ హీరోయిన్‌ చేయబోతున్నాడా? చూద్దాం. ఏం జరుగుతుందో!



Source link

Related posts

ఆరు నెల పాప మరణం సాయి ధరమ్ తేజ్ కి కనపడలేదా!

Oknews

Notification Released For The Recruitment Of Universities Vice Chancellors In Telangana

Oknews

ఏంటిది దేవర.. ఇలా అయితే కష్టమే!

Oknews

Leave a Comment