Entertainment

ఆర్జీవీ డెన్ లో అమితాబ్ బచ్చన్..వ్యూహం త్వరలో!


ఆర్జీవీ డెన్ లో అమితాబ్ బచ్చన్ ప్రత్యక్షమయ్యారు. ఆర్జీవీకి ఇండస్ట్రీలో చాలా అంటే చాలా తక్కువ మంది ఫ్రెండ్స్ ఉన్నారు. అంత తక్కువ మంది ఫ్రెండ్స్ లో అమితాబ్ ఒకరు అని చెప్పొచ్చు. ఆర్జీవీ, అమితాబ్ కాంబినేషన్ లో సర్కార్ వచ్చింది. ఈ మూవీ ఓ రేంజ్ లో ఆడేసింది. ఇక రీసెంట్ గా  అమితాబ్ బచ్చన్ హైదరాబాద్  వచ్చి  ఆర్జీవీ డెన్  లో సందడి చేశారు. డెన్ లో ఆర్జీవీ కుర్చీలో కూర్చున్న ఫోటోని  బిగ్ బి ఉన్న ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు ఆర్జీవీ. వీళ్ళ కంబినేషన్ లో సర్కార్, సర్కార్ రాజ్ , సర్కార్ 3 మూవీస్  ఆడియన్స్ ని అలరించాయి. ఇప్పుడు ఆర్జీవీ డెన్ కు బిగ్ బి రావడంతో ఫాన్స్ లో అనుమానాలు మొదలయ్యాయి.

ఆర్జీవీ తెరకెక్కించిన వ్యూహం మూవీ మార్చ్ 2న ప్రేక్షకుల ముందుకురాబోతోంది. ఈ సినిమాకు దాసరి కిరణ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇక  ఆర్జీవీతో పాటు దాసరి కిరణ్ ,అమితాబ్ ను కలిశారు. ఆ ఫోటోను షేర్ చేసిన ఆర్జీవీ “నేను దాసరి కిరణ్ కుమార్ వ్యూహం ఇంగ్ విత్ సర్కార్ ఇన్ ఆర్జీవీ డెన్” అని కాప్షన్ పెట్టారు.ఐతే  ‘వ్యూహం’  మూవీ ఇప్పటికే విడుదల కావాల్సింది. అన్ని ఏర్పాట్లు చేసుకున్నాక  రిలీజ్ కు బ్రేక్ పడింది. ముంబైకి వెళ్లి మరీ సెన్సార్ సర్టిఫికెట్ తెచ్చుకున్నారు రామ్ గోపాల్ వర్మ.ఫైనల్ గా  ‘వ్యూహం’ మూవీని మార్చి 2న విడుదల చేయటానికి రెడీ అయ్యారు. అయితే రెండో భాగం ‘శపథం’ రిలీజ్ డేట్ పై ప్రస్తుతానికి క్లారిటీ లేదు. ముందుగా మార్చి 8న ప్రేక్షకుల ముందుకి తీసుకురానున్నట్లు మేకర్స్ ప్రకటించారు కానీ.. ఇంకా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి కాలేదని తెలుస్తుంది. వ్యూహం మూవీ ప్రొమోషన్ కి అమితాబ్ ని తన డెన్ తీసుకువచ్చేసరికి నెటిజన్స్ కూడా ఫుల్ ఖుషీలో ఉన్నారు.


 



Source link

Related posts

నాగ చైతన్య తండేల్ కోసం ఆయన్ని రంగంలోకి దింపి షూట్ కూడా చేసారు. 

Oknews

nara rohit given sensational comments on jagan

Oknews

mahesh given warning to vijayashanthi

Oknews

Leave a Comment