EntertainmentLatest News

ఆ చీడ పురుగుని మా సినిమాలో తీసుకున్నందుకు మమ్మల్ని క్షమించండి!


ప్రస్తుతం అందర్నీ కలవరపెడుతున్న అంశం.. ప్రణీత్‌ హనుమంతు వ్యవహారం. సోషల్‌ మీడియాలో ఇష్టారాజ్యంగా వీడియోలు చేస్తూ అందర్నీ ఆందోళనకు గురి చేస్తున్న ప్రణీత్‌పై విమర్శ వెల్లువెత్తుతున్నాయి. యూట్యూబ్‌ ఛానల్స్‌లో, టీవీ ఛానల్స్‌లో ప్రముఖులంతా అతని ప్రవర్తనపై చర్చిస్తూ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సాయిధరమ్‌ తేజ్‌ పట్టు పట్టి ఈ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లాడు. సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం, డీజీపీ.. ఇలా అందరూ ఇష్యూ మీద స్పందించారు. దీంతో అడివి శేష్‌, మంచు మనోజ్‌, కార్తికేయ, విశ్వక్‌సేన్‌.. ఇలా ఒక్కొక్కరు ఈ ఘటనపై స్పందిస్తున్నారు. తాజాగా సుధీర్‌బాబు దీనిపై స్పందిస్తూ  నేను సోషల్‌ మీడియాకు ఎప్పుడూ దూరంగానే ఉంటాను అంటూ ప్రణీత్‌ హనుమంతు వివాదంపై ట్విట్టర్‌లో స్పందిస్తూ..  

‘హన్మంతు లాంటి వాడిని మా సినిమాలోకి తీసుకున్నందుకు నేను చాలా సిగ్గు పడుతున్నాను. మమ్మల్ని ప్రేక్షకులు క్షమిస్తారని ఆశిస్తున్నాను. వాడు అలాంటి చీడ పురుగు అని మాలో ఎవ్వరికీ తెలీదు. వాడు వాగిన చెత్త గురించి మాట్లాడాలంటే నాకు బాధగా ఉంది.. ఆ విషయాన్ని మళ్లీ గుర్తు చేసుకునే ధైర్యం కూడా రావడం లేదు.. ఇది కచ్చితంగా ఫ్రీడమ్‌ ఆఫ్‌ స్పీచ్‌ అయితే కాదు.. ఇలాంటి వాళ్లని వెంటనే శిక్షించాలి’ అంటూ సుధీర్‌ బాబు ట్వీట్‌ వేశాడు.



Source link

Related posts

ఇన్నాళ్లకు రాజమౌళిని భయపెట్టే డైరెక్టర్ వచ్చాడు!

Oknews

అలాంటివే ఇష్టం, కానీ చూసి చూసి బోర్ కొట్టేసింది: నమిత

Oknews

వినాయక నిమజ్జనంలో ఎమ్మెల్యే జోగు రామన్న డ్యాన్స్

Oknews

Leave a Comment