Entertainment

ఆ విషయంలో ఇండియా మొత్తం మీద యానిమల్ మూవీనే  నంబర్ వన్ 


డిసెంబర్ 1 న రిలీజ్ అయ్యి  థియేటర్స్ లో ఉన్నంత కాలం రికార్డుల వేటని కొనసాగించిన చిత్రం యానిమల్. ఈ మూవీ ఏ స్థాయి విజయం సాధించిందంటే ఇండియాలోనే అత్యధిక కలెక్షన్లు సాధించిన టాప్ టెన్ సినిమాల జాబితాలో ఒకటిగా యానిమల్ చేరింది. దీన్ని బట్టి యానిమల్ ఎంతగా ప్రేక్షాదరణని పొందిందో అర్ధం చేసుకోవచ్చు. అలాగే ఇటీవల ఓటిటి లో కూడా రిలీజ్ అయ్యి  తన రికార్డు వేటని కంటిన్యూ చేస్తుంది. ఇప్పుడు అందుకు  సంబంధించిన ఒక రికార్డు ఇండియా వ్యాప్తంగా చక్కర్లు కొడుతుంది.

యానిమల్ మూవీ ముందుగా చేసుకున్న ఒప్పందం ప్రకారం  జనవరి 26న ప్రముఖ ఓటిటి సంస్థ నెట్ ఫ్లిక్స్ ద్వారా విడుదల అయ్యింది. ఏ ముహూర్తాన అలా ఓటిటి లో విడుదల అయ్యిందో గాని ఇప్పుడు  ఇండియాలోనే  అత్యధిక మంది  వీక్షించిన మూవీగా యానిమల్ టాప్ ప్లేస్ లో నిలిచింది. ఈ విషయాన్ని కొద్దిసేపటి క్రితం నెట్ ఫ్లిక్స్ సంస్థ తమ సోషల్ మీడియా ప్రొఫైల్స్ లో ప్రకటించింది. పైగా ఆ  రికార్డు అంతటితో ఆగలేదు. నెట్‌ఫ్లిక్స్ కి సంబంధించి నాన్ ఇంగ్లీష్ మూవీస్ విభాగంలో సంస్థ యొక్క  గ్లోబల్ చార్ట్‌లో జెట్ స్పీడ్ వేగంతో  3వ స్థానానికి  చేరుకున్న సినిమాగా కూడా యానిమల్  రికార్డు సృష్టిస్తుంది.ఇది భారతీయ ఓటిటి చరిత్రలో ఒక అరుదైన  రికార్డు. దీంతో యానిమల్ కి  ప్రేక్షకుల్లో ఉన్న సత్తా మరోసారి రుజువయ్యింది.



 

రణబీర్ కపూర్ హీరోయిజం  రష్మిక అందచందాలతో పాటు అద్భుతమైన నటన  సందీప్ రెడ్డి వంగా డేరింగ్ డైరెక్షన్ యానిమల్ విజయం సాధించడానికి కారణం అయ్యాయి.త్రిప్తి డిమ్రి పెర్ ఫార్మెన్స్ కూడా అదనపు ఆకర్షణగా నిలిచింది .   భద్రకాళి పిక్చర్స్, సినీ వన్ స్టూడియోస్, టి సిరీస్ ఫిలిమ్స్ సంస్థలు యానిమల్ ని నిర్మించాయి.

 



Source link

Related posts

ప్రభాస్ సలార్ కి రవితేజ కిక్ కి  ఉన్న లింక్ ఇదే..రవితేజ ఫ్యాన్స్ కి ఫుల్ కిక్  

Oknews

high-court-give-green-signal-release-murder-movie  – Telugu Shortheadlines

Oknews

కన్నీళ్లు  పెట్టుకున్న తెలంగాణ నటుడు..

Oknews

Leave a Comment