Health Care

ఆ వ్యాధులకు కారణం అవుతున్న టీ, బిస్కెట్.. అలా తినకూడదంటున్న నిపుణులు!


దిశ, ఫీచర్స్ : ఉదయం అయ్యిందంటే చాలు ప్రతి ఒక్కరు టీ తాగుతుంటారు. తెల్లవారు జామునే టీ తాగనిదే కొందరికి ఆ రోజే గడవనట్లే అనిపిస్తుంది అంటుంటారు. అంటే అంత ఇష్టంగా టీ తాగుతారు. అయితే టీలో బిస్కెట్ వేసుకోవడం చాలా మందికి ఇష్టం ఉంటుంది. అందుకే చాలా మంది టీలో బిస్కెట్ వేసుకుని తింటూ ఉంటారు. కానీ టీలో బిస్కెట్ తినడం వలన అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు ఆరోగ్య నిపుణులు. అవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

టీలో బిస్కెట్ వేసుకొని తినడం వలన రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే బిస్కెట్‌లో సోడియం, చక్కెర అధికంగా ఉంటుంది. అందువల్ల టీలో బిస్కెట్స్ తినడం వలన బ్లడ్‌లో షుగర్ లెవల్స్ పెరుగుతాయి. కాబట్టి థైరాయిడ్, మధుమేహం వ్యాధి గ్రస్తులు అస్సలే టీతో పాటు బిస్కెట్ తినకూడదంట. అంతే కాకుండా బిస్కెట్స్ రోజూ తినడం వలన జీర్ణ వ్యవస్థ సరిగా ఉండదంట. ఇది గుండెకు హాని చేయడం, కొలెస్ట్రాలను పెంచుతుంది. అంతే కాకుండా మలబద్ధకం వచ్చే సమస్య ఉంటుంది. అదే విధంగా రోగనిరోధక శక్తి కూడా బలహీనపరుస్తుంది. అందువలన టీతో బిస్కెట్స్ అస్సలు తినకూడదు అంటున్నారు ఆరోగ్య నిపుణులు.



Source link

Related posts

బనానా టీని తాగడం వల్ల ఈ సమస్యలు దూరమవుతాయి!

Oknews

Creative Skills : రాత్రి ఆలస్యంగా నిద్రపోయేవారిలోనే తెలివి అధికం

Oknews

రోజూ అదే పని చేస్తున్నాడని భరించలేక.. భర్తకు విడాకులు ఇచ్చిన భార్య

Oknews

Leave a Comment