Entertainment

ఆ హీరోయిన్ విషయంలో మాది పొరపాటే.. చీర రేటు కనిపెట్టలేకపోయాం


ఇప్పుడున్న  డిజిటల్ యుగంలో మనం చెప్పాలనుకున్న విషయాన్నీ ప్రపంచం మొత్తం తెలిసేలా చెప్పవచ్చు.దీంతో చాలా మంది  తాము అనుకున్న విషయాన్నీ వెల్లడి చేస్తున్నారు. సినిమా వాళ్ళ గురించి అయితే ఆ ఇంట్రెస్ట్  కొంచెం ఎక్కువగానే ఉంటుంది. తాజాగా ఒక హీరోయిన్ విషయంలో ఇదే తరహా  కామెంట్స్ చేసారు. కానీ ఇప్పుడు పొరపాటు పడ్డామని అంటున్నారు. ఇంతకీ  అసలు విషయం ఏంటో చూద్దాం.

స్టార్  హీరోయిన్ ప్రియాంక చోప్రా గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. ఎన్నో హిట్ సినిమాల్లో నటించి చాలా మంది అభిమానులని సంపాదించింది. ఆమె  ఇటీవలే అయోధ్య రాముడ్ని దర్శించుకుంది. హస్బెండ్  నిక్ జోన్స్  కూతురు మేరీ  తో కలిసి  స్వామిని దర్శించుకుంది. ఈ సమయంలో ఆమె చాలా సింపుల్ గా ఉన్న శారీని ధరించింది దీంతో ఇదేంటి ప్రియాంక చాలా సింపుల్ చీరని ధరించిందంటు సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు. కొంత మంది అయితే తమకి  తోచిన విధంగా రేట్లు కూడా పెడుతున్నారు.

 కానీ ఇప్పడు ఆ చీర  రేటు గురించి తెలిసి షాక్ అవుతున్నారు. చీర ఖరీదు అక్షరాల 63800 రూపాయలు. తయారీకి  వాడిన రంగులు ఫ్యాబ్రిక్ అంతా కూడా ఆర్గానిక్. అంటే పూర్తిగా ఆర్గానిక్ మెటీరియల్ తో తయారయ్యింది. చర్మానికి ఎలాంటి హానీ కూడా  కలగచెయ్యదు. పైగా ప్రియాంక కోసం పది  రోజుల పాటు తయారు చేసారు. ఇప్పుడు ఇదంతా బయటకి రావడంతో చీర విషయంలో పోస్ట్ చేసిన వాళ్ళందరు నోరెళ్లబెడుతున్నారు. అమెరికాలోనే సెటిల్ అయిన  ప్రియాంక బాలీవుడ్ లో  సినిమాలు చెయ్యాలని అభిమానులు కోరుకుంటున్నారు.



Source link

Related posts

విజయ్ దేవరకొండ ‘ఫ్యామిలీ స్టార్’ బుకింగ్స్ కి సూపర్ రెస్పాన్స్!

Oknews

రామ్ చరణ్ తో మహేష్ హీరోయిన్..మరి ఎన్టీఆర్ హీరోయిన్ 

Oknews

విజయ్‌ని ఇరకాటంలో పెట్టిన స్టార్‌ క్రికెటర్‌.. దళపతి రియాక్షన్‌ ఏమిటో!

Oknews

Leave a Comment