దిశ, ఫీచర్స్: సాధారణంగా ఇల్లు కట్టుకునేటప్పుడు వాస్తు చూసి నిర్మించుకుంటాము. ఇంటి వాస్తు సరిగా లేకపోతే, చిక్కులు , చికాకులు వస్తుంటాయి. పనికి రాని వస్తువులను చాలా మంది ఇంట్లోనే పెట్టుకుంటూ ఉంటారు. వీటి వల్ల ఆర్ధిక సమస్యల దగ్గర నుంచి అనారోగ్య సమస్యలు వరకు వెంటాడుతూనే ఉంటాయని గుర్తించరు. ముఖ్యంగా ఇంటి ముందు ఈ వస్తువులు అసలు ఉంచొద్దు.. లేదంటే దరిద్రం పట్టుకుంటుందట. అవేంటో ఇక్కడ చూద్దాం..
1. ఇంటి ముందు ఎప్పుడూ తడిగా ఉండకూడదు. మీ ఇంటి మెయిన్ డోర్ ముందు పరిశుభ్రంగా లేకపోతే మీ ఇంట్లోకి లక్ష్మి దేవి ఎలా ప్రవేశిస్తుంది? అలాగే, ఇంటి లోపల ముళ్ల చెట్లను అసలు ఉంచవద్దు. లేకపోతే లక్ష్మి దేవి మీ ఇంట్లోకి ప్రవేశించదు. తులిప్స్ ,సువాసనగల పువ్వులను ఇంటి ముందు ఉంచాలి.
2. మనలో కొందరు చెత్త వేయడానికి బయటకి వెళ్లడం ఎందుకు అని, మెయిన్ డోర్ దగ్గర డస్ట్‌బిన్‌ను ఉంచుతారు. కానీ ఇది పెద్ద తప్పు. ఇలా చేస్తే, రావాల్సిన లక్ష్మి కూడా రాదు. కాబట్టి ఇంటి ముందు డస్ట్ బిన్ పెట్టకండి.
3. చాలా మంది ఇళ్ల ముందు రంగు రంగుల లైట్లను పెట్టుకుంటారు. కానీ ఇది మంచిది కాదట. ఎందుకంటే ఆ లైట్లు, మీ వీధిని ప్రకాశవంతం చేయకుండా చేస్తుంది. కాబట్టి మీ ఇంటి ప్రధాన ద్వారం ముందు మెరుపు లైట్లు ఉంచకండి.
4. తెల్లటి పూలు పూసే చెట్టును ఇంటి మెయిన్ డోర్ ముందు ఎప్పుడూ ఉంచకండి.
5. ఇంటి వెలుపల మీ బూట్లు , చెప్పులు విడవడం పెద్ద తప్పు. కాబట్టి ఇంట్లో ఒక మూలన బూట్లు ,షూలు ఉంచండి.