దిశ, ఫీచర్స్: ఇంటిని వాస్తు ప్రకారం కట్టుకుంటాం.. అయినా గ్రహదోషాలు పట్టిపీడీస్తాయి. అలాగే ఆ ఇంట్లో ఉండేవారికి ఆర్థిక సమస్యలు వేధిస్తాయి. హిందూ పురాణాల ప్రకారం వీటిని పాటిస్తే.. వాస్తు దోషాలు తొలగించుకోవచ్చు. కర్పూరంతో వాస్తు దోష నివారణ ఎలా చేసుకోవచ్చో ఇక్కడ తెలుసుకుందాం..
1. ఇల్లును వాస్తు ప్రకారం నిర్మించుకుంటాం. వంట గది, బెడ్ రూం, టాయిలేట్, కిచెన్, హాల్ వంటివి వాస్తు ప్రకారం సరైన దిశలో ఉంచుతారు. అయితే, ఇంటి వంటగదిలో కర్పూరం కాల్చడం వల్ల ఆ ఇంటికి ఏవైనా దోషాలు ఉంటే తొలగిపోతాయని నిపుణులు చెబుతున్నారు.
2. ఇల్లు అందరికీ స్వర్గం లాంటిది. ఇంట్లో వాస్తు దోషం ఉంటే నరకయాతన అనుభవిస్తారు. ఈ నివారణలలో కొన్నింటిని ప్రయత్నించాలి. సాధారణంగా వంటగదిలో మనకి నచ్చిన వంట చేస్తాము. ఇంటి వాస్తు కూడా వంటగదిపై ఆధారపడి ఉంటుంది. రాత్రి పడుకునేటప్పుడు వంటగదిలో కర్పూరాన్ని కాల్చడం వల్ల పేదరికం నుండి బయటపడవచ్చట. వంటగదిలో కర్పూరాన్ని కాల్చడం వల్ల మీ ఇంటికి సానుకూల శక్తి వస్తుంది.
3. అంతేకాకుండా, వంటగదిలో కర్పూరాన్ని కాల్చే ముందు ఇంటి వంటగదిలోని వంట పాత్రలను రాత్రిపూట బాగా కడగాలి. తర్వాత వంటగదిలో కర్పూరాన్ని వెలిగించాలి. దీంతో కుటుంబం ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడుతుంది.
4. వాస్తు దోషం ఉన్న ఇంటి ఆరోగ్య పరిస్థితి కూడా బాగోదు. వీరికి తరచుగా ఆరోగ్య సమస్యలు ఉంటాయి. ఈ కర్పూరం రెమెడీ మీ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.