Health Care

ఇంట్లో హాయిగా కూర్చుని లక్షలు సంపాదిస్తున్న వ్యక్తి.. ఎలాగో చూసేద్దామా..


దిశ, ఫీచర్స్ : డబ్బు సంపాదించడం అంత తేలికైన పని కాదు. దాని కోసం కొంతమంది చాలా కష్టపడుతూ ఉంటారు. ఆఫీసులో పనిచేసే వ్యక్తులు ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 8 నుంచి 10 గంటల వరకు పనిచేస్తూనే ఉంటారు. మరికొంతమంది రోజంతా కష్టపడుతూనే ఉంటారు. అప్పుడు మాత్రమే వారి చేతికి కొన్ని వందల రూపాయలు వస్తాయి. ఇది వారి ఇంటి ఖర్చులను తీర్చడంలో సహాయపడుతుంది. కానీ కొంతమంది మాత్రం హాయిగా ఇంట్లోనే కూర్చొని నెలనెలా లక్షల రూపాయలు సంపాదిస్తున్నారు. కొన్ని విశిష్టమైన వ్యాపారాలను స్థాపించి ఆ వ్యాపారం ద్వారా లక్షల్లో సంపాదిస్తూ ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతూ వార్తల్లో నిలుస్తున్నారు. ఇప్పుడు అలాంటి ఒక వ్యక్తి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ఈ వ్యక్తి పేరు పీటర్ బహుత్. అతను అమెరికాలో నివసిస్తుండేవారు. ప్రస్తుతం జార్జియాలోని అట్లాంటా సమీపంలో నివసిస్తున్నాడు. చిన్నతనంలో ఎప్పుడు తాత ఇంటికి వెళ్లినా ఇంటి బయట ఆరుబయట చెట్లకింద పడుకునేవాడినని తెలిపారట. అలాగే పెరిగి పెద్దయ్యాక ట్రీ హౌస్ కట్టి దాని ద్వారా డబ్బు సంపాదించొచ్చు కదా అని ఆలోచించాడు. ఆలోచన వచ్చిందే తడువు అట్లాంటాకు సమీపంలోని చెట్లతో కూడిన స్థలాన్ని కొనుగోలు చేసి 8 అడుగుల ఎత్తులో ఒక చిన్న చెట్టు ఇంటిని నిర్మించాడు.

ట్రీ హౌస్ నుండి పెద్ద డబ్బు సంపాదించడం..

పీటర్ ఆ చిన్న ట్రీ హౌస్‌లో మూడు పడకగదులుగా మార్చినప్పటికీ ప్రజలు ఆ ట్రీ హౌస్ లో రెంట్ ఉండేందుకు మక్కువ చూపేవారు. ఆ ట్రీ హౌస్‌ను కూడా అద్దెకు తీసుకునేందుకు ఇష్టపడేవారు. కొన్ని వార్తా పత్రికల నివేదిక ప్రకారం అతను ఇప్పుడు తన ట్రీ హౌస్ ను రెంట్ కి ఇస్తూ పెద్ద మొత్తంలో డబ్బు సంపాదిస్తున్నాడు. దీని కోసం అతను తన ఉద్యోగాన్ని కూడా విడిచిపెట్టాడు.

ఒక రాత్రి అద్దె రూ.31 వేలు..

పీటర్ తన ట్రీ హౌస్‌కి ఒక్క రాత్రి అద్దె దాదాపు రూ.31 వేలు తీసుకుంటున్నారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే అధిక అద్దె ఉన్నప్పటికీ, అతని ట్రీ హౌస్ కి చాలా మంది ప్రజలు వస్తుంటారు. ఎందుకంటే అతని ట్రీ హౌస్ లో అన్ని సౌకర్యాలు ఉన్నాయి. ఇందులో అందమైన ఫర్నిచర్ కూడా ఉంది.



Source link

Related posts

వారానికొకసారి అయినా ఈ కూరగాయను తీసుకోండి.. ఆ సమస్యలకు చెక్ పెట్టొచ్చు!

Oknews

రోజంతా బిజీగా ఉంటున్నారా? అయితే పడుకునే ముందు పిల్లలకు ఇవి చెప్పండి..!

Oknews

టీ తాగేటప్పుడు అదనంగా చక్కెర వేసుకుంటున్నారా?

Oknews

Leave a Comment