తెలుగుతో పాటు ఇతర భాషల వెబ్ సిరీస్ లు ఈ మధ్యకాలంలో మంచి హిట్ సాధిస్తున్నాయి. మలయాళం ఇండస్ట్రీకి ఈ సంవత్సరం గోల్డెన్ ఇయర్ అని చెప్పాలి. ఎందుకంటే మలయాళ సినిమాలు ఎక్కువగా హిట్ పొందాయి.
ప్రేమలు, ముంజుమ్మల్ బాయ్స్, ఆవేశం, భ్రమయుగం.. ఇలా దాదాపు అన్నీ హిట్లుగా నిలిచాయి. ఇప్పుడు అలాంటి హిట్ కోసం ఓ వెబ్ సిరీస్ రూపొందించారు మేకర్స్. ఒక్కరు కాదు ఇద్దరు కాదు దాదాపు మలయాళం ఇండస్ట్రీ అంతా కలిసి ఓ వెబ్ సిరీస్ లో నటించారు. ఈ సిరీస్ గత రెండేళ్ళుగా షూటింగ్ జరుపుకుంది. ఈ సిరీస్ పేరు ‘ మనోరథంగల్(Manorathangal)’. ఇందులో మోహన్ లాల్, మమ్ముట్టి, ఫహాద్ ఫాజిల్, కమల్ హాసన్, బిజు మేనన్, పార్వతీ తిరువత్తు, అపర్ణ బాలమురళి, అసిఫ్ అలీ, సిద్ధిఖీ తదితరులు ఈ సిరీస్ లో నటించారు.
ఇంతమంది స్టార్ కాస్ట్ ఉన్న ఈ సిరీస్ ని రాసింది ఎమ్ టీ వాసుదేవర నాయర్. తొమ్మిది భాగాల ఆంథాలజీని ఎనిమిది మంది దర్శకులు తెరకెక్కించారు. ఎట్టకేలకు ఈ సిరీస్ ఓటీటీలోకి రావడానికి సిద్ధమైంది. అగస్ట్ 15 నుండి జీ5 లో స్ట్రీమింగ్ అవుతుందని మేకర్స్ ఓ ప్రకటనలో తెలిపారు. ఈ సిరీస్ మలయాళంతో పాటు తెలుగు, కన్నడ, తమిళ భాషల్లో స్ట్రీమింగ్ అవ్వనుంది. ఇలా భారీ తారాగణం ఉన్న ఈ క్రేజీ సిరీస్ ని చూడటానికి మీలో ఎంతమంది రెడీగా ఉన్నారో కామెంట్ చేసేయ్యండి.