Entertainment

‘ఇండియన్‌2’, ‘తంగలాన్‌’ రైట్స్‌ దక్కించుకున్న ప్రముఖ ఓటీటీ సంస్థ!


ఒకప్పుడు వినోదం అంటే సినిమా థియేటర్లే. కాలక్రమేణా ఎన్నో మాధ్యమాలు వచ్చాయి. దాంతో థియేటర్లలో సందడి తగ్గింది. ప్రస్తుతం ఓటీటీ బాగా విస్తరిస్తున్న నేపథ్యంలో థియేటర్లకు జనం రావడమే తగ్గిపోయింది. థియేటర్లలో రిలీజ్‌ అయిన సినిమా ఓటీటీలోకి ఎప్పుడొస్తుందా అని ఎదురుచూస్తున్నారు. సినిమా రిలీజ్‌ రోజునే అది ఏ ఓటీటీలో స్ట్రీమ్‌ అవుతుందనే విషయం తెలుస్తోంది. ఇప్పుడలా కాకుండా సినిమా రిలీజ్‌కి ముందే ఓటీటీ పార్టనర్‌ ఎవరో రివీల్‌ చేసేస్తున్నారు.  

తాజాగా రెండు భారీ సినిమాలు తమ ఓటీటీ ప్లాట్‌ ఫామ్‌ను కన్‌ఫర్మ్‌ చేసాయి. కమల్‌హాసన్‌, శంకర్‌ కాంబినేషన్‌లో రూపొందుతున్న ‘ఇండియన్‌ 2’, విక్రమ్‌, పా. రంజిత్‌ కాంబినేషన్‌లో రూపొందుతున్న ‘తంగలాన్‌’. ప్రముఖ ఓటీటీ  సంస్థ నెట్‌ఫ్లిక్స్‌ ఈ రెండు సినిమాలను స్ట్రీమింగ్‌ చేయనున్నట్టు ప్రకటించింది. ఈ రెండు సినిమాలు రిలీజ్‌ అయిన కొద్ది రోజులకు ఓటీటీలో స్ట్రిమింగ్‌కి రానున్నాయి. 



Source link

Related posts

‘పోచర్‌’పౖౖె మహేష్‌ ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌.. అభినందిస్తున్న నెటిజన్లు!

Oknews

ఓటీటీలో మూడొందల మిలియన్ వాచ్ మినిట్స్ దాటేసిన ది కేరళ స్టోరీ… ఏం ఉందంటే!

Oknews

chandramukhi-returns-sequel-tamil-p-vasu-declares – Telugu Shortheadlines

Oknews

Leave a Comment