ప్రస్తుతం ఇండియాలో ప్రభాస్ (Prabhas) ని మించిన స్టార్ లేడంటే అతిశయోక్తి కాదేమో. వరుస పాన్ ఇండియా సినిమాలతో బాక్సాఫీస్ దగ్గర సంచలనాలు సృష్టిస్తున్నాడు. ముఖ్యంగా ఫస్ట్ డే కలెక్షన్స్ పరంగా.. ప్రభాస్ కి దరిదాపుల్లో కూడా ఇతర స్టార్స్ లేరు.
మొదటి రోజు వసూళ్ల పరంగా ఇప్పటిదాకా ప్రపంచవ్యాప్తంగా రూ.100 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టిన ఇండియన్ సినిమాలు 12 ఉంటే.. అందులో ఐదు సినిమాలు ప్రభాస్ వే కావడం విశేషం. ఓపెనింగ్ డే నే రూ.215 కోట్ల గ్రాస్ రాబట్టి, మొదటిసారి ‘బాహుబలి-2’ తో ఈ ఫీట్ సాధించాడు ప్రభాస్. ఆ తరువాత రూ.130 కోట్ల గ్రాస్ తో ‘సాహో’, రూ.140 కోట్ల గ్రాస్ తో ‘ఆదిపురుష్’, రూ.170 కోట్ల గ్రాస్ తో ‘సలార్’ కూడా మొదటి రోజు వసూళ్ల పరంగా వంద కోట్ల క్లబ్ లో చేరాయి. ఇక ఇప్పుడు ప్రభాస్ తాజా చిత్రం ‘కల్కి 2898 AD’ (Kalki 2898 AD) కూడా ఈ ఫీట్ సాధించింది. ఈ మూవీ వరల్డ్ వైడ్ గా ఫస్ట్ డే రూ.190 కోట్ల గ్రాస్ రాబట్టింది. దీంతో ఓపెనింగ్ డే రూ.100 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టిన సినిమాల లిస్టులో.. ప్రభాస్ వి ఐదు సినిమాలు అయ్యాయి.
ఫస్ట్ డే కలెక్షన్స్ పరంగా ఇతర ఇండియన్ స్టార్స్ ఎవరూ ప్రభాస్ కి దగ్గరలో కూడా లేరు. ప్రభాస్ తర్వాతి స్థానంలో ‘పఠాన్’, ‘జవాన్’ అనే రెండు సినిమాలతో షారుఖ్ ఖాన్ అన్నాడు. ఈ ఇద్దరి హీరోల సినిమాల కాకుండా.. ఇప్పటిదాకా ‘2.0’, ‘ఆర్ఆర్ఆర్’, ‘కేజీఎఫ్-2’, ‘లియో’, ‘యానిమల్’ సినిమాలు మాత్రమే ఈ ఫీట్ సాధించాయి.