శృంగార తారగా ప్రపంచవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులు సంపాదించింది. ఆమె పేరు తెలియని వారు లేరంటే అతిశయోక్తి కాదు. ప్రస్తుతం బాలీవుడ్‌లో నటిగా కొనసాగుతోంది. అయితే ఆమె నటిగా కంటే శృంగార చిత్రాల ద్వారానే పాపులర్ అయింది. ఇక వాటికి స్వస్తి చెప్పి నటిగా తనని తాను ప్రూవ్ చేసుకునేందుకు కృషి చేస్తోంది. ఆ నటి మరెవరో కాదు సన్నీ లియోన్. ఇప్పటికే కోట్లకు పడగలెత్తిన సన్ని.. ఓ సాధారణమైన కానిస్టేబుల్ పోస్టుకు అప్లయ్ చేసింది. నమ్మడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజంగానే జరిగింది.
ఉత్తరప్రదేశ్‌లో పోలీస్ రిక్రూట్‌మెంట్స్ జరుగుతున్నాయి. దీనికి సంబంధించిన ఎగ్జామినేషన్ కోసం సన్నిలియోన్ అప్లయ్ చేయడం చర్చనీయాంశంగా మారింది. దీనికి సంబంధించిన హాల్ టికెట్‌పై సన్నిలియోన్ పేరుతో పాటు ఆమె హాట్ ఫోటో కూడా ఉంది. వివరాల్లోకి వెళితే.. ఓ ఆకతాయి చేసిన పని ఇది. ఉత్తర ప్రదేశ్‌లో ఇలాంటివి ప్రతిరోజూ దర్శనమిస్తూనే ఉంటాయి. ఇది కూడా అలాంటిదే. అయితే అధికారులు మాత్రం ఆమె పేరు మీద హాల్ టికెట్ కేటాయించడంతోపాటు ఎగ్జామ్ ఏ సెంటర్‌లో ఉందనేది కూడా మెన్షన్ చేశారు. ఈ ఘటనపై ఉత్తరప్రదేశ్ పోలీసులు చాలా సీరియస్ అయ్యారు. వెంటనే దీనిపై ఎంక్వరీ చేశారు. మహోబా ప్రాంతానికి చెందిన ఓ సెల్ నంబర్ ఆధారంగా ఈ హాల్ టికెట్ జనరేట్ అయినట్టు గుర్తించారు. అడ్రస్ మాత్రం ముంబాయిది ఉంది. రిజిస్ట్రేషన్ జరుగుతున్నప్పుడు హాల్ టికెట్‌ను అప్‌లోడ్ చేసే టైమ్‌లో ఈ పొరపాటు జరిగిందని పోలీసుల విచారణలో తేలింది.