Health Care

ఇబ్బందులతో ప్రయోజనాలు .. సమస్యలను ఎదుర్కొనేలా అలర్ట్ చేస్తాయంటున్న నిపుణులు


దిశ, ఫీచర్స్ : మీరు అనుకోకుండా ఎండలో జర్నీ చేయాల్సి రావడంవల్ల ఇబ్బంది పడ్డారనుకోండి.. ఏం చేస్తారు? దాని నుంచి బయటపడాలని ఆలోచిస్తారు. ఇకముందు అలా ప్రయాణం చేయాల్సి వస్తే గత ఇబ్బందిని గుర్తు చేసుకొని అలర్ట్ అవుతారు. ఈసారి ఎండ తక్కువగా ఉన్నప్పుడో, అసలు ఎండే లేని ఏ తెల్లవారు జామునో బయలు దేరుతారు. అలాగే అవమానం, మొహమాటం, బాధ, భావోద్వేగం వంటి అనేక ఇబ్బందికరమైన పరిస్థితులు, ప్రవర్తనలు మనుషులను ఇబ్బంది పెట్టే సమస్యలుగా అనిపిస్తాయి. కానీ వాస్తవానికి అవి వ్యక్తులను అలర్ట్ చేస్తాయి. నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ జర్నల్‌ స్టడీ ప్రకారం.. ప్రజలు ఇబ్బందులను కొందరు మంచివి కాదని చెప్తున్నప్పటికీ, సామాజిక క్రమాన్ని నిర్వహించడంలో, జీవితంలోని ఒడిదుడుకులు ఎదుర్కోవడంలో అవి సహాయపడతాయి.

మంచి నిర్ణయాలకు ప్రేరణ

ఇబ్బందులను ఎదుర్కొన్న వ్యక్తులు వాస్తవానికి దానిపట్ల అవగాహన కూడా కలిగి ఉంటారు. మరోసారి అటువంటి ఇబ్బందులు ఎదరు కాకుండా మంచి నిర్ణయాలు తీసుకునేలా అది ప్రేరేపిస్తుంది. ఇబ్బందులు అనే అనుభవాల పునాదులపై ఏర్పడిన సమాజమే, వాటిని నివారించడానికి కూడా ప్రయత్నిస్తుంది. వ్యక్తులు కూడా అంతే మోసం, అవమానం వల్ల ఇబ్బంది పడటమో, ఇతరులను ఇబ్బంది పెట్టడమో వంటివి చేసి ఉండవచ్చు. కానీ చాలా వరకు మరోసారి అలా జరగకూడదనే మంచి నిర్ణయాన్ని తీసుకోవడంలో ఇవి దోహదపడతాయి.

సంబంధాలు బలో పేతం..

ఇబ్బందికర పరిస్థితులు మనుషుల మధ్య సంబంధాలను బలోపేతం చేస్తాయి. మీకు సాధారణంగా తెలిసిన ఒక వ్యక్తి తన ఇబ్బందుల గురించి మరొక వ్యక్తికి చెప్తున్నారంటే అక్కడ నమ్మకం అనేది ఏర్పడి ఉంటుంది. ఒకవేళ అంతకుముందు అటువంటిది లేకపోయినా ఇబ్బందులను ప్రస్తావించడం కారణంగా అవతలి వ్యక్తి సానుకూలంగా స్పందించడం, అర్థం చేసుకోవడం, సహాయపడటం వంటివి చేసినప్పుడు బాధిత వ్యక్తి కృతజ్ఞతా భావంతో ఉంటాడు. ఎప్పుడైనా అవతలి వ్యక్తి ఇబ్బందుల్లో ఉంటే.. వాటినుంచి బయటపడేందుకు సహాయం పొందిన వ్యక్తి ప్రయత్నిస్తారు. ఇలా బంధాలు బలపడతాయి.

నెట్ వర్కింగ్ టూల్స్‌గా..

ఇబ్బందులు ఒక సోషల్ నెట్ వర్కింగ్ టూల్స్‌గా ఉపయోగపడతాయని 2011లో జరిగిన ఒక అధ్యయనంలో వెల్లడైంది. ఇవి సాంఘీకరణ సంకేతమని, విశ్వాసాన్ని పెంపొందిస్తాయని, సామాజిక బంధాల్లో నిబద్ధతను సూచిస్తుస్తాయని నిపుణులు పేర్కొంటున్నారు. అంతేకాకుండా ఇవి రిఫ్లెక్సివ్ రెస్పాన్స్‌ను రేకెత్తిస్తాయి. ఇబ్బంది పడే వ్యక్తితో ప్రొఫెషనల్ నెట్‌వర్కింగ్ సందర్భాలు సర్‌ ప్రైజింగ్ బెనిఫిట్స్ అందిస్తాయని స్టడీలో వెల్లడైంది. అలాగే సమాజంలో, పని చేసే కార్యాలయంలో ప్రజలు, సిబ్బంది, ఉన్నతాధికారులు తేలికపాటి ఇబ్బందిని అనుభవించడంవల్ల వారిలో ప్రొఫెషనల్ స్కిల్స్ మరింత పెరుగుతాయి. ఇక్కడ టీమ్ వర్క్ ప్రోత్సహించబడవచ్చు. వ్యక్తులను వేరు చేయడానికి బదులుగా కనెక్ట్ చేయడంలో ఇబ్బందులు ఏదో రూపంలో హెల్ప్ అవుతుంటాయి.

సెల్ఫ్ మోటివేషన్..

ఇబ్బందులు వాస్తవానికి పవర్ ఫుల్ ఎమోషన్స్ కూడా. ఇవి వ్యక్తుల్లో బాధను కలిగిస్తాయి. కంటతడి పెట్టిస్తాయి. ఇదే క్రమంలో నైపుణ్యాలను మెరుగుపరచుకోవడానికి గొప్ప సాధనంగా ఉపయోపగపడతాయి. ఎందుకంటే వ్యక్తులు తాము ఎదుర్కొన్న ఇబ్బంది కరమైన భావోద్వేగ పరిస్థితి మళ్లీ ఎదురవుతుందోమోనని భయపడి అలర్ట్ అవుతారు. దానిని నివారించడానికి ప్రయత్నిస్తారు. అలాగే ఇబ్బందులు సదరు వ్యక్తులను ఏం చేయాకూడదో తెలుసుకునేలా మోటివేట్ చేస్తాయి. తమ అనుభవం ద్వారా ఇబ్బందిని ఎదుర్కొన్న వ్యక్తులు సెల్ప్ మోటివేట్ చేసుకుంటారు. అలాగే క్రమ శిక్షణను, ఆత్మ విశ్వాసాన్ని, ధైర్యాన్ని పెంపొందించుకోవడంలో, భయాన్ని ఎదుర్కోవడంలో, వాస్తవాలను గ్రహించడంలో, లైఫ్ క్వాలిటీని పెంచడంలో ఇబ్బందులు పునాదులుగా ఉంటాయి.



Source link

Related posts

64 ఏళ్లకు భర్త రాసిన లేఖ చదివి కన్నీళ్లు పెట్టుకున్న భార్య.. అందులో ఏముందంటే..

Oknews

బెడ్ పై కూర్చుని భోజనం చేస్తున్నారా? అయితే ఈ సమస్యలు తప్పవు..

Oknews

ఆ అడవిలో అంతుచిక్కని రహస్యాలు.. అక్కడ ఆత్మహత్యలకు దయ్యాలే కారణమా..

Oknews

Leave a Comment