Health Care

ఇలా ప్రపోజ్ చేస్తే ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే!


దిశ, డైనమిక్ బ్యూరో: అమ్మాయి అబ్బాయి మధ్య పరిచయం కొన్ని సార్లు ప్రేమగా మారుతుంది. అయితే ఆ ప్రేమను అమ్మాయికి తెలియజేయడంలో చాలా మంది అబ్బాయిలు విఫలమవుతుంటారు. కొందరూ సక్సెస్‌ కూడా అవుతుంటారు. మరి ఆ ప్రేమను పెళ్లిదాక తీసుకపోవడం అనేది పెద్ద టాస్క్‌లా ఉంటుంది. ఫ్రెండ్‌గా ఉన్న తనను మ్యారేజ్ ప్రపోజ్ చేస్తే తను అంగీకరిస్తుందా? లేక ఉన్న ఫ్రెండ్‌షిప్ పోతుందా? అని భయంలో అబ్బాయిలు టెన్షన్ పడుతుంటారు. కొందరు మాత్రం క్రియేటివ్ గా ఆలోచించి తనకు నచ్చిన అమ్మాయిలకు అబ్బాయిలు మ్యారేజ్ ప్రపోజ్ చేస్తుంటారు. ఈ నేపథ్యంలోనే సోషల్ మీడియాలో తాజాగా ఓ వీడియో వైరల్‌గా మారింది.

డిఫరెంట్ మ్యారేజ్ ప్రపోజల్

ఓ అబ్బాయి తన గల్‌ఫ్రెండ్‌ని పెళ్లి చేసుకోవడం కోసం డిఫరెంట్‌గా మ్యారేజ్ ప్రపోజల్ చేస్తాడు. రెండు బీఎండబ్ల్యూ కార్ల వెనుక అద్దంపై ‘విల్‌ యూ మ్యారీమి’ అని రాయిస్తాడు. తర్వాత అబ్బాయి మంచి లోకేషన్‌కు తన అమ్మాయిని తీసుకవెళ్తాడు. ఆ సమయంలో తన వెనుకనుంచి అనుసరిస్తున్న రెండు కార్లు సడెన్‌గా వారి కారు ముందుకు వస్తాయి. ఆ కార్ల పై రాసి ఉన్న విల్ యూ మ్యారీమి అనే వర్డ్స్‌ను అమ్మాయి చూస్తూ ఉంటుంది. ఆ కార్లు సడెన్‌గా వీరి కారు ముందు ఆగుతాయి. వెంటనే అమ్మాయికి అబ్బాయి ఉంగరం ఇచ్చి ప్రపోజ్ చేస్తారు. దీంతో అమ్మాయి ఫిదా అయిపోతుంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. జంట చాలా క్యూట్‌గా ఉందని, అబ్బాయి ఎంతో క్రియేటీవ్‌గా ప్రపోజ్ చేశాడని, ఇలా ప్రపోజ్ చేస్తే ఎవరైనా ఫిదా అవ్వాల్సిందేనని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.



Source link

Related posts

పిల్లలు ఒత్తిడికి గురవుతున్నారా..? ఇలా దూరం చేయండి..

Oknews

థైరాయిడ్ పెషేంట్స్ ఈ ఫుడ్ తింటున్నారా? నిపుణులు ఏం చెబుతున్నారంటే?

Oknews

క్యూట్‌గా ఉన్నారని చిన్నారులను కిస్ చేస్తున్నారా ?.. ఈ ప్రమాదం పొంచి ఉన్నట్టే!

Oknews

Leave a Comment