సినీ సంగీత చక్రవర్తుల్లో ఇళయరాజా(ilayaraja)కూడా ఒకరు.ఆ మాటకొస్తే అగ్ర తాంబూలాన్ని కూడా ఇవ్వచ్చు. ఏ మ్యూజిక్ డైరెక్టర్ కి అయినా శ్రోతలు ఉండటం సహజం. కానీ ఇళయరాజా దగ్గరకి వచ్చే సరికి మాత్రం శ్రోతలు కాస్తా వీరాభిమానులుగా మారిపోతారు. సంగీత ప్రపంచంలో ఎన్ని స్వరాలూ దాగి ఉన్నాయో అన్నిటిలోను ట్యూన్ చేసిన రికార్డు ఆయన సొంతం. అదే విధంగా ఆయన కంపోజ్ చేసిన పాటలు ఈ నిమిషానికి కూడా ఎక్కడో ఒక చోట మారుమోగిపోతూనే ఉంటాయి. అంతటి ఖ్యాతి గడించిన ఇళయరాజాకి సంబంధించిన లేటెస్ట్ న్యూస్ ఒకటి ఇప్పుడు స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచింది.
మంజుమ్మేల్ బాయ్స్(manjummel boys)మలయాళ చిత్ర సీమకి చెందిన ఈ మూవీ మొన్నఏప్రిల్ లో తెలుగులో రిలీజ్ అయ్యి మంచి విజయాన్ని నమోదు చేసుకుంది. ఇక ఈ మూవీ క్లైమాక్స్ లో ఇళయరాజా సంగీతంలో కమల్ హాసన్ హీరోగా 1991 లో వచ్చిన గుణ మూవీలోని ఒక సాంగ్ లిరిక్స్ అండ్ మ్యూజిక్ ని వాడారు. దీంతో తన అనుమతి లేకుండా పాట వాడారని
ఇళయరాజా కోర్టులో కేసు వేసాడు. అప్పట్లో ఈ విషయం సంచలనం సృష్టించింది కూడా. మంజుమ్మేల్ బాయ్స్ నిర్మాతలు రెండు కోట్లు ఇవ్వాలని లేదా పాటని తీసివేయాలని ఇళయరాజా డిమాండ్ చేస్తూ వస్తున్నారు. ఇక తాజాగా వస్తున్న సమాచారం ప్రకారం ఇళయరాజాకి అరవై లక్షలు ఇవ్వడానికి నిర్మాతలు ఒప్పుకున్నారనే వార్తలు వస్తున్నాయి. ఏది ఏమైనా మంజుమ్మేల్ బాయ్స్ విజయానికి గుణ సాంగ్ లిరిక్ కూడా ఒక కారణం. అది ఎంటైర్ సినిమా కథ మొత్తాన్ని చెప్తుంది. అందుకే మేకర్స్ అరవై లక్షలు ఇవ్వడానికి సిద్దపడుతున్నారు.
ఇక ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో మొత్తానికి ఇళయరాజా అనుకున్నది సాధించాడని అంటున్నారు.అరవై లక్షలకి ఒప్పుకుంటాడా అనే వాళ్ళు కూడా లేకపోలేదనుకోండి. ఇక ఎప్పటినుంచో తన అనుమతి లేకుండా తన పాటలు వాడుకోడానికి లేదని ఇళయరాజా చెప్తూనే వస్తున్నాడు. గతంలో తన ప్రాణ స్నేహితుడు, గాన గంధర్వుడు ఎస్ పి బాలసుబ్రమణ్యం గారినే తన అనుమతి లేకుండా పాడద్దని చెప్పాడు.