AP CID On Sand Irregularities : చంద్రబాబు హయాంలో ఇసుక అక్రమాలపై ఏపీ సీఐడీ విచారణకు సిద్ధమైంది. ఇసుక అక్రమాలపై కేసు నమోదు చేసింది. APMDC ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయగా… ఇందులో A1గా పీతల సుజాత, A2గా చంద్రబాబు, A3గా చింతమనేని A4గా దేవినేని ఉమాతో పాటు మరికొందరిపై కేసులు నమోదు చేసింది. మైన్స్ అధికారుల ఫిర్యాదుపై FIR నమోదు చేసింది సీఐడీ. ఉచిత ఇసుక ముసుగులో రూ.10 వేల కోట్ల దోపిడీ జరిగినట్లు ఎఫ్ఐఆర్ లో పేర్కొంది.