Health Care

ఇసుక రేణువంత బ్యాగ్.. కాస్ట్ మాత్రం రూ. 52 లక్షలు.. ఎందుకంత స్పెషల్


దిశ, ఫీచర్స్: Mschf కంపెనీ వివాదాస్పద ప్రొడక్ట్స్ తయారు చేయడంలో ముందుంటుంది. రీసెంట్ గా రక్తంతో స్నీకర్స్ తయారు చేసి కాంట్రవర్సీ క్రియేట్ చేసిన ఈ కంపెనీ.. తాజాగా ఇసుక రేణువంత మైక్రో ప్లాస్టిక్ బ్యాగ్ తయారు చేసి మరోసారి వార్తల్లోకి ఎక్కింది. ఫోటోపాలిమర్ రెసిన్‌తో తయారు చేయబడిన బ్యాగ్ కేవలం 657 * 222 * 700 మైక్రోమీటర్లు కొలతతో ఆకట్టుకుంటుంది. కాగా ఈ బ్యాగ్ మినీ-బ్యాగ్ ట్రెండ్‌ను న్యూ హైట్స్ కు తీసుకెళ్తుందనడంలో సందేహం లేదంటున్నారు విశ్లేషకులు.

లూయిస్ విట్టన్ మోనోగ్రామ్ OnTheGo హ్యాండ్‌బ్యాగ్ నుంచి స్ఫూర్తి పొంది తయారు చేయబడిన బ్యాగ్.. మార్కెట్ లోకి తీసుకొచ్చేందుకు ఇంకా అనుమతి పొందలేదు. కానీ జూన్ 19 నుంచి జూన్ 27 వరకు ఫారెల్ విలియమ్స్ ఆక్షన్ హౌస్ జూపిటర్‌లో జరిగిన జస్ట్ ఫ్రెండ్స్ సేల్‌లో భాగంగా వేలం వేయబడింది. ఏకంగా దాదాపు రూ. 55 లక్షలకు అమ్ముడుపోవడం విశేషం. కాగా Mschf ఇర్రిలవెంట్ ఆర్ట్ ప్రొడక్ట్స్ తయారు చేయడంలో ప్రసిద్ధి చెందగా.. 2016లో స్థాపించబడింది. ఇక రియల్ బ్లడ్ స్నీకర్స్ విషయంలో నైక్ ఈ కంపెనీపై కేసు కూడా వేసింది.





Source link

Related posts

స్ట్రేంజర్స్‌తో చాటింగ్‌తో బోలెడన్ని హెల్త్ బెనిఫిట్స్.. ఎలా అంటారా..?

Oknews

పుచ్చకాయ తిని గింజలు పడేస్తున్నారా? వీటి లాభాలు తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు!

Oknews

చంద్ర గ్రహణం రోజు ఇలా చేస్తే.. మీరు ఊహించనంత డబ్బు మీ సొంతం..

Oknews

Leave a Comment