దిశ, ఫీచర్స్ : చాలా సంవత్సరాల నిరీక్షణ తర్వాత WhatsApp లో వీడియో కాల్ స్క్రీన్ షేర్ ఫీచర్‌ను వచ్చేసింది. ఇప్పటి వరకు ఇన్‌స్టాగ్రామ్‌లో మాత్రమే ఉన్న ఈ ఫీచర్ వాట్సాప్‌లో అందుబాటులోకి రావడంతో వినియోగదారులు చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వీడియో కాల్ స్క్రీన్ షేర్ ఫీచర్‌లో, మీరు వీడియో కాలింగ్ సమయంలో మీ స్మార్ట్‌ఫోన్ స్క్రీన్‌ను అవతలి వ్యక్తితో షేర్ చేసుకోవచ్చు. మరి WhatsApp స్క్రీన్ షేర్ ఫీచర్ గురించి మీరు కూడా తెలుసుకోండి.
WhatsApp స్క్రీన్ షేర్ ఫీచర్
ముందుగా మీ వాట్సాప్ ఖాతాను తెరవండి. దీని తర్వాత, డౌన్ డ్రాప్‌కి వెళ్లి అందుబాటులో ఉన్న ట్యాబ్ పై ప్రెస్ చేయండి. ఇప్పుడు కెమెరా స్విచ్ ఆప్షన్ ఇక్కడ అందుబాటులో ఉంటుంది. దాని పై క్లిక్ చేసిన తర్వాత, స్క్రీన్ షేర్ ఫీచర్ చిహ్నాన్ని ప్రెస్ చేయాలి.
ఇప్పుడు మీ ఫోన్ లో ఒక పాప్ – అప్ కనిపించిన తరువాత స్క్రీన్‌ను షేర్ చేయడానికి స్టార్ట్ నౌ పై ప్రెస్ చేయండి. దాంతో స్క్రీన్ షేర్ ఫీచర్ యాక్టివేట్ అవుతుంది. మీరు మీ స్క్రీన్‌ను షేర్ చేసుకుంటున్నారని నిర్ధారించడానికి మీకు సందేశం కనిపిస్తుంది.
WhatsApp స్క్రీన్ షేర్ ఫీచర్ ప్రయోజనాలు
ఈ ఫీచర్‌ని ఉపయోగించడం ద్వారా Google Meet, జూమ్ కాల్‌ల పై మీ ఆధారపడటం అవసరం లేదు. అలాగే, మీరు సమావేశాన్ని ప్రారంభించడానికి ముందు షెడ్యూల్ చేయాల్సిన అవసరం లేదు. మీరు వాట్సాప్ గ్రూప్ కాల్ చేయడం ద్వారా తక్షణమే సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు. మీ ఫోన్‌లోని WhatsApp స్క్రీన్ షేర్ ఫీచర్ సహాయంతో డేటాను షేర్ చేయవచ్చు.