Health Care

ఈ రెడ్ జ్యూస్ తో శరీరానికి నేచురల్ డిటాక్స్.. ఎలా తయారు చేయాలంటే..


దిశ, ఫీచర్స్ : ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉండేందుకు కూరగాయలు తినమని సలహా ఇస్తారు. అంతే కాదు పచ్చి కూరగాయల రసం తాగడం ద్వారా ఆరోగ్యంగా ఉండటమే కాకుండా చర్మం కూడా మెరిసిపోతుందట. కూరగాయలతో తయారుచేసే ఈ జ్యూస్‌లు ఆరోగ్యానికి మేలు చేయడమే కాకుండా రుచిని కూడా కలిగి ఉంటాయి. మీరు సలాడ్‌లో తినే క్యారెట్, బీట్‌రూట్ రసాన్ని జ్యూస్ చేసుకుని తాగవచ్చు. ఇది రక్తహీనతను దూరం చేస్తుంది. అనేక ఇతర వ్యాధుల నుంచి కూడా దూరం చేస్తుంది. ఈ జ్యూస్‌లో టొమాటో కలిపితే మరింత హెల్తీగా చేసుకోవచ్చు. ఈ జ్యూస్ తో శరీరంలో విటమిన్లు, మినరల్స్ లోటు ఉండదు.

క్యారెట్, టొమాటో, బీట్‌రూట్ జ్యూస్ తో కలిగే ప్రయోజనాలు..

ఈ మూడు కూరగాయలలో అయోడిన్, ఐరన్, జింక్, మెగ్నీషియం వంటి పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. ఇది మీ రోగనిరోధక శక్తిని పెంచడమే కాకుండా అనేక వ్యాధుల నుండి మిమ్మల్ని రక్షిస్తుంది. దీనితో పాటు విటమిన్ ఎ, బి, బి2, బి1, కెరోటిన్ లు లభిస్తాయి. ఈ పోషకాలు మీ చర్మాన్ని ఆరోగ్యంగా, కాంతివంతంగా ఉంచుతాయి.

రక్తహీనత దూరం..

శరీరంలోని రక్తహీనతను తొలగించడానికి ప్రతిరోజూ ఈ జ్యూస్ ని తాగాలని వైద్యనిపుణులు చెబుతున్నారు. రక్తహీనతతో బాధపడేవారికి రక్తాన్ని పెంచడానికి క్యారెట్, టొమాటో, బీట్రూట్ రసం త్రాగాలి. దీనితో పాటు తరచుగా అలసిపోయినట్లు, బలహీనంగా ఉండేవారు కూడా ఈ జ్యూస్‌ని నిత్యం తింటే మంచిదంటారు.

శరీరం సహజంగా డిటాక్స్ అవుతుంది..

బరువు తగ్గడానికి ఈ జ్యూస్ ని రోజూ తాగాలని నిపుణులు చెబుతున్నారు. ఈ జ్యూస్‌ని రోజూ తాగడం వల్ల శరీరం సహజంగా డిటాక్స్‌ని పొందుతుంది. ఈ జ్యూస్ శరీరంలోని మలినాలను తొలగించడంలో సహాయపడుతుంది. ఈ రసంలో అధిక మొత్తంలో ఫైబర్ కంటెంట్, తక్కువ క్యాలరీ కంటెంట్ ఉంటుంది. కాబట్టి దీన్ని బరువు తగ్గించేందుకు కూడా తాగవచ్చు.

Read More..

పచ్చి పసుపు టీ తో ఇన్ని ప్రయోజనాలా ?



Source link

Related posts

#FearFoodChallange..మానసికంగా ఎఫెక్ట్ | Fear Food Challange

Oknews

కుక్కర్‌లో వండిన పప్పు ఆరోగ్యానికి మంచిదేనా? ..లేక ప్రమాదమా?

Oknews

Dog Temple : కుక్కలకు గుడి కట్టిన గ్రామస్థులు.. ఎక్కడంటే?

Oknews

Leave a Comment