EntertainmentLatest News

ఈ వారం సినిమాల సందడి మామూలుగా లేదు!


ప్రస్తుతం బాక్సాఫీస్ దగ్గర ‘కల్కి 2898 AD’ (Kalki 2898 AD) ప్రభంజనం కొనసాగుతోంది. జూన్ 27న విడుదలైన ఈ చిత్రం రూ.1000 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టి.. ఇప్పటికీ విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. గత వారం జులై 12న విడుదలైన ‘భారతీయుడు-2’ మాత్రం నెగటివ్ టాక్ తో చేతులెత్తేసింది. దీంతో ఈ వారం విడుదలవుతున్న సినిమాలపై దృష్టి పడింది. ఈ వారం అనగా జులై 19న విడుదలవుతున్న సినిమాల్లో ప్రధానంగా ‘డార్లింగ్’ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. దీంతో పాటు ‘పేకమేడలు’, ‘ది బర్త్ డే బాయ్’ సినిమాలపై కూడా ప్రేక్షకుల దృష్టి ఉంది. అలాగే ‘క్రైమ్ రీల్’, ‘జస్ట్ ఏ మినిట్’ సినిమాలు కూడా ఈ వారం ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి.

డార్లింగ్:

ప్రియ‌ద‌ర్శి, నభా నటేష్, అనన్య నాగళ్ల ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘డార్లింగ్’ (Darling). ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మించిన ఈ సినిమాకు అశ్విన్ రామ్ దర్శకత్వం వహించాడు. స్ప్లిట్ పర్సనాలిటీ డిజార్డర్ భార్యతో భర్త ఎలాంటి ఇబ్బందులు పడ్డాడని ఇంట్రెస్టింగ్ పాయింట్ తో రూపొందిన ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ పై మంచి అంచనాలే ఉన్నాయి. మరి ఈ సినిమా థియేటర్లలో ఏ స్థాయిలో నవ్వులు పంచుతుందో చూడాలి.

పేకమేడలు:

ఇటీవల ప్రచార చిత్రాలతో అందరి దృష్టిని ఆకర్షించిన చిత్రం ‘పేకమేడలు’ (Peka Medalu). బాధ్యత తెల్సిన భార్య, బాధ్యత మరిచి అత్యాశతో గాల్లో మేడలు కట్టే భర్త మధ్య జరిగే కథగా ఈ చిత్రం రూపొందింది. వినోద్ కిషన్, అనూష కృష్ణ జంటగా నీలగిరి మామిళ్ల దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రానికి రాకేష్ వర్రే నిర్మాత.

ది బర్త్ డే బాయ్:

బర్త్ డే సెలబ్రేషన్ పేరుతో యువకుల అత్యుత్సాహం ఎలాంటి పరిస్థితికి దారి తీసిందనే ఆసక్తికర పాయింట్ తో, వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందిన మూవీ ‘ది బర్త్ డే బాయ్’ (The Birthday Boy). విస్కీ డైరెక్ట్ చేసిన ఈ సినిమాకి భరత్ నిర్మాత. రవికృష్ణ, రాజీవ్ కనకాల, మణి, రాజా అశోక్, విక్రాంత్ తదితరులు ఈ చిత్రంలో నటించారు.



Source link

Related posts

ఫిబ్రవరి సెంటిమెంట్.. టిల్లు అన్న మల్ల వస్తుండు

Oknews

brs mla harishrao slams telangana government through twitter | Harish Rao: ‘ఒకటో తేదీనే జీతాలు అన్నారు, ఎక్కడ?’

Oknews

ఎన్టీఆర్ అంటే ఎంత అభిమానమో..పేరు కూడా కలిసొచ్చింది…

Oknews

Leave a Comment