Health Care

ఈ విత్తనాలు తింటే ఆరోగ్యమే ఆరోగ్యం.. మీరూ ట్రై చేయండి..


దిశ, ఫీచర్స్ : ఆరోగ్యంగా ఉండాలంటే పౌష్టికాహారంతో పాటు వర్కవుట్‌లు చేయడం కూడా చాలా ముఖ్యం. ఇది కాకుండా, డ్రై ఫ్రూట్స్, విత్తనాలను కూడా ఆహారంలో తీసుకోవాలి. విత్తనాలు మహిళల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. వీటిలో అన్ని రకాల పోషకాలు ఉంటాయి. ఈ విత్తనాలలో గుమ్మడి గింజలు కూడా ఉన్నాయి. అయితే ఆరోగ్య నిపుణులు ఏం చెబుతున్నారంటే మహిళలు ఈ విత్తనాలు తింటే ఎన్నో అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చని చెబుతున్నారు. వీటిని స్మూతీ, స్నాక్ లేదా అల్పాహారంగా కూడా తినవచ్చట. గుమ్మడి గింజల్లో విటమిన్ ఈ తో పాటు ఫైబర్, ఐరన్, పొటాషియం కూడా ఉన్నాయి. యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండే గుమ్మడి గింజలను క్రమం తప్పకుండా తినడం వల్ల స్త్రీల అనేక సమస్యలు పరిష్కారమవుతాయి. గుమ్మడి గింజల ద్వారా మహిళలకు కలిగే ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

గర్భంలో పిండం అభివృద్ది..

గుమ్మడి గింజలలో ఎక్కువ మొత్తంలో జింక్ ఉంటుంది. గర్భిణీలు వీటిని తీసుకుంటే పిండం అభివృద్ధిలో సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు. జింక్ నాడీ వ్యవస్థ అభివృద్ధికి సహాయపడుతుందట. అందుకే గర్భధారణ సమయంలో మహిళలు తమ ఆహారంలో గుమ్మడి గింజలను చేర్చుకోవాలి.

రక్తహీనతకు చెక్..

శరీరంలో హిమోగ్లోబిన్ లోపిస్తే రక్తహీనత సమస్య వస్తుంది. ముఖ్యంగా మహిళల్లో ఈ లక్షణం ఎక్కువగా కనిపిస్తుంది. గుమ్మడి గింజలు తినడం వల్ల శరీరంలో రక్తం లోటు ఉండదు. ఇందులో ఐరన్ పుష్కలంగా లభిస్తుంది. ఏ స్త్రీ అయినా రక్తహీనతతో బాధపడుతుంటే గుమ్మడి గింజలను తినాలి.

బలమైన ఎముకలు

ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం 30 సంవత్సరాల వయస్సు తర్వాత, ఎముకలు క్రమంగా బలహీనపడతాయి. అలాంటప్పుడు ఎముకలు లేదా కీళ్ల నొప్పికి సంబంధించిన సమస్యలు ఉండవచ్చు. గుమ్మడి గింజల్లో కాల్షియంతో పాటు విటమిన్ కె కూడా పుష్కలంగా లభిస్తుంది. వీటిని క్రమం తప్పకుండా తినడం వల్ల మీ ఎముకలు దృఢంగా ఉంటాయి.

బరువు తగ్గడం..

ఊబకాయం సమస్యతో బాధపడే స్త్రీలు గుమ్మడి గింజలను తప్పనిసరిగా తినాలి. వీటిలో ఫైబర్ పుష్కలంగా ఉండటం వల్ల పొట్ట ఎక్కువసేపు నిండిన అనుభూతిని కలిగిస్తుంది. దీంతో ఫుడ్ మళ్లీ మళ్లీ తినాలనే కోరిక తగ్గిపోయి అతిగా తినే సమస్య నుంచి తప్పించుకోవచ్చు.



Source link

Related posts

గ్రీన్‌ బీన్స్‌ తింటే..మన శరీరానికి కలిగే లాభాలు ఇవే!

Oknews

కుంభరాశిలో మూడు గ్రహాలు కలయిక.. ఆ రాశుల వారికి డబ్బే డబ్బు

Oknews

మీ డైట్‌లో ఈ కూరగాయలు, ఫుడ్స్ చేర్చుకుంటే.. ఆ సమస్యలకు చెక్ పెట్టొచ్చు!

Oknews

Leave a Comment