Entertainment

ఈ వ్యాధి వల్ల బట్టలు కూడా వేసుకోలేకపోయాను..మంతెన సూచన అమూల్యం 


2006 లో ఎస్.వి కృష్ణారెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన మాయాజాలం సినిమా ద్వారా వెండి తెర ఆరంగ్రేటం చేసిన నటీ పూనమ్ కౌర్. తెలుగు, తమిళ,కన్నడ,హిందీ భాషల్లో కలిపి సుమారు నలభై పైగా సినిమాల్లో చేసిన పూనమ్  సినిమాలకంటే వివాదాస్పద అంశాల  ద్వారానే  బాగా పాపులర్ అయ్యింది. తాజాగా ఆమె  చేసిన ఒక ట్వీట్ పలువురిని ఆలోచనలో పడేసింది.

పూనమ్ కౌర్ కి ఫైబ్రోమైయాల్జియా అనే వ్యాధి ఉంది  దాదాపు రెండు సంవత్సరాల నుంచి ఆమె  ఆ వ్యాధితో బాధపడుతుంది. ఇప్పుడు ఆమె ప్రముఖ ఆయుర్వేద వైద్యులు మంతెన సత్యనారాయణ రాజుతో కలిసి ఒక ప్రోగ్రాం చేసింది. ఫైబ్రోమైయాల్జియా వ్యాధి నివారణకు మంతెన పూనమ్ కి కొన్ని సూచనలు చేసారు. ఆ సలహాలు తనకి ఎలా ఉపయొగపడ్డాయో  పూనమ్ ప్రేక్షకులకి తెలియచేయనుంది. ఇప్పుడు ఈ ప్రోగ్రాం ఆదివారం నాడు  ప్రముఖ జీ  ఛానెల్ లో ప్రసారం కాబోతుంది. ఈ సందర్భంగా   రిలీజ్ అయిన ప్రోమోలో ఫైబ్రోమైయాల్జియా వల్ల  బట్టలు కూడా వేసుకోలేక పోయానని  పూనమ్ చెప్పిన మాటలతో  పలువురు ఆమె పరిస్థితిని చూసి జాలిపడుతున్నారు.

ఫైబ్రోమైయాల్జియా తో బాధపడేవాళ్ళకి  విపరీతమైన నిద్రలేమి కలగడంతో పాటు త్వరగా అలసట చెందుతారని అలాగే తీవ్ర డిప్రెషన్స్ ని  కూడా వెళ్తారని పూనమ్ వ్యాధి లక్షణాల గురించి చెప్పింది. అలాగే ఈ  వ్యాధికి ఒకే రకమైన మందులు కూడా లేవని ఆమె  చెప్పింది. పూనమ్ ఇటీవల చిరంజీవి పద్మవిభూషణ్ తీసుకున్న సందర్భంగా త్రివిక్రమ్ ఆయన్ని  కలుసుకోవడం వాళ్లిద్దరు క్లోజ్ గా ఫోటోలు దిగడం తనని బాధించిందని కూడా ఆమె చెప్పింది. 

 



Source link

Related posts

డైరెక్టర్ అన్వేషణలో చిరంజీవి.. విశ్వంభర రిజల్ట్ తో సంబంధం లేదు

Oknews

యూట్యూబ్ లో బాలయ్య మూవీ..ఇది వాళ్ళ పనే  

Oknews

వసూళ్ల వర్షం కురిపిస్తున్న గామి.. రెండు రోజుల్లోనే…

Oknews

Leave a Comment