వారానికి ఏడు రోజులు అన్నది ఎంత నిజమో ఆ ఏడు రోజుల్లో వచ్చే శుక్రవారం కోసం తెలుగు సినిమా ప్రేక్షకులు ఎదురు చూస్తు ఉంటారనేది కూడా అంతే నిజం.హీరో ఎవరన్నది అనవసరం శుక్రవారం బొమ్మ పడటం ఆలస్యం ఏ సినిమా బాగుందో ఎంక్వరీ చేసి మరి థియేటర్స్ ముందు బారులు కడతారు.అసలు కొత్త సినిమా రిలీజ్ అవుతుందంటనే మూవీ లవర్స్ కి పండగ వచ్చినంత సంబరంగా భావిస్తారు. తాజాగా ఈ శుక్రవారం వాళ్ళ సంబరం రెట్టింపు కాబోతుంది
ఈ శుక్రవారం అంటే ఫిబ్రవరి 2 న ఒకటి కాదు రెండు కాదు మొత్తం పది సినిమాలు రిలీజ్ అవుతున్నాయి.ప్రేక్షకులని సినీ మైకంలో ముంచడానికి వస్తున్న ఆ సినిమాల లిస్ట్ ఈ విధంగా ఉంది. అంబాజీ పేట మ్యారేజ్ బ్యాండ్, బూట్ కట్ బాల రాజు, కిస్మత్,ధీర,గేమ్ ఆన్, హ్యాపీ ఎండింగ్, మెకానిక్, ఉర్వి, చిక్ లెట్స్, శంకర ఇలా మొత్తం పది చిత్రాలు ప్రేక్షకులని కనువిందు చేయనున్నాయి. ఈ చిత్రాలన్నీ కూడా మంచి కంటెంట్ తో రూపుదిద్దుకొని ప్రేక్షకులని అలరించడానికి వస్తున్నాయి.
సినిమా పరిశ్రమలో జయాపజయాలు అనేవి ఉంటాయి కాబట్టి ఏ సినిమా హిట్ అవుతుందో ఏ సినిమా డిజాస్టర్ అవుతుందో ఆ శుక్రవారమే తేలిపోతుంది.కాకపోతే అన్ని సినిమాలు ప్రేక్షకులని అలరించాలని కోరుకుందాం.అలాగే నెక్స్ట్ శుక్రవారం వచ్చే అంటే తొమ్మిదవ తేదీన మాస్ మహారాజా రవితేజ నటించిన ఈగిల్ రజనీకాంత్ లాల్ సలాం మమ్ముట్టి యాత్ర లాంటి సినిమాలు కూడా ఉన్నాయి. మరి ఆ సినిమాలుని తట్టుకొని ఏ సినిమాలు నిలబడతాయో చూడాలి.