జాన్వీ కపూర్, మీనాక్షి చౌదరి, ప్రియాంక మోహన్, భాగ్యశ్రీ బొంస్లే. ఇప్పుడు ఈ నలుగురు హీరోయిన్ల జోలికి అస్సలు వెళ్ళకండి. ఎందుకు వెళ్లకూడదో వెళ్తే ఏమవుతుందో మీరే చూడండి.
ఫస్ట్ జాన్వీ కపూర్(janhvi kapoor)గురించి చెప్పుకుందాం. ఇప్పుడు ఈ ముద్దుగుమ్మ ఫుల్ బిజీ. ఇంకొన్ని సంవత్సరాల పాటు ఆమె సినీ డైరీ ఖాళీ లేదు. ఎన్టీఆర్ దేవర (devara) తో పాటు రామ్ చరణ్, ఉప్పెన ఫేమ్ బుచ్చి బాబు డైరెక్షన్ లో వస్తున్న మూవీలోను జాన్వీ నే హీరోయిన్. అదే విధంగా హిందీలో సన్నీ సంస్కారికి తులసి కుమారి లో చేస్తుంది. దీంతో మేకర్స్ జాన్వీ ని తమ సినిమాలకి బుక్ చేసుకోవాలంటే మరికొంత కాలం వేచి ఉండాల్సిన పరిస్థితి. ఇక మీనాక్షి చౌదరిని తీసుకుంటే ఇళయ దళపతి విజయ్ తో ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం చేస్తుంది. అదే విధంగా దుల్కర్ సల్మాన్ తో లక్కీ భాస్కర్, విశ్వక్ సేన్ తో మెకానిక్ రాఖీ , మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తో మట్కా తో బిజీగా ఉంది. ఇప్పుడు మరికొన్ని కొత్త ప్రాజెక్ట్స్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇటీవల ప్రారంభం అయిన వెంకటేష్,అనిల్ రావిపూడి మూవీలో కూడా చేస్తుంది. అధికార ప్రకటన ఇంకా రాక పోయినా కూడా చిరంజీవి విశ్వంభర లో కూడా ఒక ప్రధాన పాత్రకి మీనాక్షి ఎంపిక అయినట్టుగా వార్తలు వస్తున్నాయి.
ఇక ప్రియాంక మోహన్ (priyanka mohan)విషయం తీసుకుందాం. పవన్ కళ్యాణ్ ఓజీ (og)తో పాటు నాని సరిపోదా శనివారం చేస్తు బిజీగా ఉంది. ఇదే టైం లో తమిళంలో జయం రవి తో బ్రదర్ అనే మూవీ చేస్తుంది.ఈ మూడు చిత్రాలే కాకుండా మరికొన్ని ప్రాజెక్ట్స్ లో కమిట్ అయ్యిందనే వార్తలు వస్తున్నాయి. ఇక నూతన కధానాయిక భాగ్యశ్రీ భోర్సే(bhagyashri bhorse) గురించి చెప్పుకోవాలంటే రవితేజ మిస్టర్ బచ్చన్ లో చేస్తుంది. ఆమెకిదే మొదటి సినిమా. అది రిలీజ్ అవ్వకుండానే విజయ్ దేవరకొండ, గౌతమ్ తిన్ననూరి కాంబోలో వస్తున్న మూవీ లోను, దుల్కర్ సల్మాన్ కొత్త మూవీలోను చేస్తుంది. సో ఇప్పుడు వీళ్ళ గ్రహాలు పీక్ లో ఉన్నాయి. కాబట్టి డేట్స్ కోసం కొంచం ఆగాల్సిందే. ఇక రష్మిక (rashmikha)గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు. పుష్ప 2 , నాగ్ ధనుష్ ల కుబేర తో పాటు ది గర్ల్ ఫ్రెండ్ రెయిన్ బో,చేస్తుంది. అలాగే హిందీలో చావా, సికిందర్ వంటివి చేస్తు ఫుల్ బిజీ గా ఉంది.