Health Care

ఉగాది రోజు ఇలా చేస్తే.. సంవత్సరం అంతా డబ్బే డబ్బు!


దిశ, ఫీచర్స్ : ఉగాది పండుగ వచ్చేసింది. చెట్లు చిగుళ్లతో, కోయిల కూతలతో వసంత ఋతువు ఆగమనం వేళ తెలుగు ప్రజలందరూ సంతోషంగా జరుపుకునే తొలి పండుగ ఉగాది. సృష్టి ప్రారంభమైన రోజు కాబట్టి దీన్ని ఉగాది పండుగ అంటారు. చైత్రశుద్ధ పాడ్యమి రోజున దీనిని ఘనంగా జరుపుకుంటారు. ఈసారి క్రోధి నామ ఉగాది జరుపుకుంటున్నారు. క్రోధినామ సంవత్సరం అందరికీ బాగుండాలని, శుభాలే జరగాలని కోరుకుంటారు. కాగా, ఈ సంవత్సరం ఇలా చేస్తే ఇంట్లో సుఖశాంతులు విల్లి విరవడమే కాకుండా ధనలక్ష్మి కటాక్షం కలిగి, ఏడాదంతా చేతినిండా డబ్బే ఉంటుందంట. కాగా, ఈరోజు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

తెలుగు నూతన నామ సంవత్సరం ఉగాది పండుగ రోజున నూనెతో తలంటుకొని అభ్యంగన స్నానం ఆచరించాలి.ఉగాది పండుగ రోజు కొత్త బట్టలు తప్పనిసరిగా ధరించి, ఇష్టదైవాన్ని తలచుకోవాలి.ఉగాది పచ్చడిని తయారు చేసుకుని కుటుంబ సభ్యులందరూ ఒకే చోట కూర్చొని తాగాలంట. అంతే కాకుండా ఉగాది పండుగ రోజు పంచాంగ శ్రవణం విని, నైవేద్యాలను మీ ఇష్ట దైవానికి లేదా, కుల దైవానికి పెట్టాలి. తప్పకుండా ఈరోజు లక్ష్మీ దేవిని పూజించి, నైవేద్యాలను సమర్పించాలి. ఇలా చేయడం ద్వారా ఆరోగ్యం బాగుండటమే కాకుండా, ఇంట్లో డబ్బు నిలుస్తుంది. అలాగే కొత్త బట్టలను, ఆభరణాలను, కొత్త గొడుగును, లేదా విసనకర్ర ను కొనుగోలు చేయడం చేస్తే మంచిది. ఇలా ఉగాది పండుగ రోజు కొనుగోలు చేస్తే ఇంట్లో డబ్బులు సంవత్సరం అంతా నిలుస్తాయని చెప్తున్నారు పండితులు.



Source link

Related posts

రంజాన్‌కు, ఖర్జూరకు ఉన్న సంబంధం ఏంటో తెలుసా?

Oknews

CS ప్రొఫెషనల్, ఎగ్జిక్యూటివ్ ఫలితాల విడుదల ఎప్పుడంటే..

Oknews

శాండ్విచ్ ప్రియులు తప్పక చూడాల్సిన వీడియో.. తేనెటీగలను కూడా వదలకుండా!

Oknews

Leave a Comment