ఉత్తరాంధ్రకు మరోసారి మోసం


కేంద్ర బడ్జెట్ లో ఉత్తరాంధ్రకు మరోసారి మోసం జరిగింది. ఏపీకి తలమానికం అయిన స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఉపసంహరించే విషయంలో ఒక్క మాట కూడా కేంద్రం చెప్పలేదని అంటున్నారు. స్టీల్ ప్లాంట్ ని స్ట్రాటజీస్ సేల్ నుంచి పక్కకు తప్పించినట్లుగా ప్రకటించలేదని గుర్తు చేస్తున్నారు.

విశాఖ రైలే జోన్ అన్నది ఎక్కడ ఉందో తెలియదు, దాని పరిపూర్తిని ఏమి చేస్తారో చెప్పలేదు, అయిదేళ్ల క్రితం విశాఖకు రైల్వే జోన్ వచ్చిందని చెప్పారు, ఈ రోజుకీ అది అలాగే ఉంది అని అంటున్నారు. అదేవిధంగా విశాఖ మెట్రో రైల్ కి నిధులు కేటాయించలేదని అంటున్నారు.

మెగా సిటీ అయిన విశాఖకు ఉత్తరాంధ్రకు నిధులు ఏ మాత్రం కేటాయింపులు లేవని పెదవి విరుస్తున్నారు. ఉత్తరాంధ్ర అభివృద్ధికి ప్రత్యేక నిధులు ఇస్తామని అన్నది మాటలకే పరిమితం అని అంటున్నారు. గతంలో కూడా వెనకబడిన జిల్లాలకు ప్యాకేజీ అని చెప్పారు. మూడేళ్ల పాటు ప్రతీ జిల్లాకు యాభై కోట్లు ఇచ్చి ఆపేశారు, ఇపుడు మళ్లీ ప్యాకేజీ అని చెబుతున్నారు.

అది ఎలా ఉంటుందో ఏమిటో మాత్రం చెప్పలేదని అంటున్నారు. అలాగే భోగాపురం విమానాశ్రయానికి విశాఖ తీర ప్రాంతం నుంచి రోడ్డు నిర్మాణానికి నిధులు కేటాయింపు ప్రస్తావన కూడా బడ్జెట్ లో లేదని అంటున్నారు. ఏ ప్రభుత్వ రంగ సంస్థకు కూడా బడ్జెట్ లో కేటాయింపులు లేవని వామపక్షాలు సహా ప్రజా సంఘాల నేతలు ఎత్తి చూపిస్తున్నారు.

ఉత్తరాంధ్ర ప్రాంత అభివృద్ధికి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అంతా కేంద్రం మీద ఒత్తిడి తీసుకుని రావాలని కోరుతున్నారు. టీడీపీ, జనసేన, వైసీపీ సహా అన్ని పార్టీలు ఒకే త్రాటి మీదకు వస్తేనే తప్ప కేంద్రం నుంచి రావాల్సినవి రావు అని అంటున్నారు.

The post ఉత్తరాంధ్రకు మరోసారి మోసం appeared first on Great Andhra.



Source link

Leave a Comment