Congress Manifesto : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలవ్వడంతో… పార్టీలో మేనిఫెస్టోలపై దృష్టిపెట్టాయి. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో రూపకల్పనకు కసరత్తు చేస్తుంది. ఉద్యోగులకు ఓల్డ్ పెన్షన్ పథకం హామీని మేనిఫెస్టో చేరుస్తున్నామని కాంగ్రెస్ మేనిఫెస్టో కమిటీ ఛైర్మన్ శ్రీధర్ బాబు తెలిపారు. ఎమ్మెల్యే శ్రీధర్ బాబు ఆధ్వర్యంలో హైదరాబాద్ గాంధీ భవన్ లో మేనిఫెస్టో కమిటీ సమావేశం జరిగింది. మేనిఫెస్టోలో తమకు ప్రత్యేక పథకాలు పెట్టాలని పలు వర్గాలు శ్రీధర్ బాబును కోరారు. డోమెస్టిక్ వర్కర్లు, పారిశుద్ధ్య కార్మికులు, గిగ్ వర్కర్లు, ట్రాన్స్ జెండర్లు, తెలంగాణ ఉద్యమ కారులు, టూర్స్ అండ్ ట్రావెల్స్ డ్రైవర్స్ యూనియన్స్, తెలంగాణ క్యాబ్ డ్రైవర్ యూనియన్, స్ట్రీడ్ వెండర్స్ , రిటైర్డ్ ఉద్యోగులు ఈ సమావేశం లో పాల్గొని కాంగ్రెస్ మేనిఫెస్టో లో పెట్టాల్సిన అంశాలపై చర్చించారు.