Health Care

ఎండు చేపలు తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు..!


దిశ, ఫీచర్స్: సాధారణంగా చేపలు తినడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఇందులో ఉన్న విటమిన్ ఎ వల్ల కళ్లకు చాలా మంచిది. అదే విధంగా తరచుగా చేపలు తినడం వల్ల ఆరోగ్యంతో పాటు మన శరీరానికి కావాల్సిన అన్ని రకాల పోషకాలు కూడా అందుతాయి. అయితే మార్కెట్లో మనకు పచ్చి చేపలు అలాగే ఎండు చేపలు ఇలా రెండు రకాల చేపలు లభిస్తూ ఉంటాయి. ఎక్కువ శాతం మంది పచ్చి చేపలు తెచ్చుకుని తింటూ ఉంటారు. కేవలం కొన్ని ప్రదేశాల్లో కొంతమంది మాత్రమే ఈ ఎండు చేపలతో కూరలు చేసుకుని తింటూ ఉంటారు. ఎండు చేపల పేరు వినగానే చాలామంది ముక్కు మూసుకుంటూ ఉంటారు. ఎందుకంటే వాటి నుంచి వచ్చే వాసన చాలా భయంకరంగా ఉంటుంది. అందుకే వాటిని తినడానికి కూడా చాలా మంది ఇష్టపడరు. కానీ చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే ఎండు చేపలతో బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అయితే ఎండు చేపలు తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో దాని గురించి నిపుణులు ఏం చెబుతున్నారో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

*ఎండు చేపలలో పుష్కలంగా ప్రోటీన్లు, యాంటీ ఆక్సిడెంట్లు, పొటాషియం, ఫాస్ఫరస్, సెలీనియం, నియాసిన్, విటమిన్ బి 12, సంతృప్త కొవ్వు ఆమ్లాలు, కేలరీలు, సోడియం ఉంటాయి. కాబట్టి వీటిని తినడం వల్ల ఎండు శరీరం పొడిబారడం తగ్గుతుందని చెబుతున్నారు నిపుణులు.

*అంతేకాదు రక్తపోటును, నరాల సమస్యలు నియంత్రించి.. కండరాల నిర్మాణానికి ఎండు చేపలు దోహదం చేస్తాయని అంటున్నారు నిపుణులు .

*అదేవిధంగా ఎండు చేపలలో ఉండే పొటాషియం నాడీ వ్యవస్థను, కండరాలను, గుండె పనితీరును మెరుగుపరుస్తుంది అంటున్నారు నిపుణులు.

*వీటిలో ఉండే ఆరోగ్యకరమైన కొవ్వు మన శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ని తగ్గించి మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతుంది. మరి ముఖ్యంగా ఎండు చేపలు గర్భిణీ స్త్రీలకు ఎంతో మంచి చేస్తాయని అంటున్నారు నిపుణులు.

*ఎండు చేపలలో ఫాస్పరస్ పుష్కలంగా ఉండటం వల్ల శరీరంలో ఎముకలు పుష్టిగా ఉంటాయి. అంతే కాదు దంతాల నిర్మాణాన్ని నిర్వహించడానికి కూడా ఎండు చేపలు ఎంతగానో ఉపయోగపడతాయి.

*ఎండు చేపలలో ఉండే విటమిన్ బి12 ఎర్ర రక్త కణాల పెరుగుదలకు ఎంతగానో ఉపయోగపడతాయి. అదే విధంగా శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచే గుణాలు కూడా పుష్కలంగా ఉంటాయి.

*కాబట్టి ఎండు చేపల వాసన పక్కనపెట్టి తరచుగా తినడం అలవాటు చేసుకోండి. ఆరోగ్యంగా ఉండండి.

నోట్: పై వార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. పాఠకుల అవగాహన కోసం మాత్రమే దీనిని అందిస్తున్నాం. నిర్ధారణలు, పర్యవసనాలకు సంబంధించి ‘దిశ’ ఎటువంటి బాధ్యత వహించదు. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించడం ఉత్తమం.



Source link

Related posts

దాదాపు 60 శాతం మంది భారతీయులు బద్ధకస్తులే…

Oknews

మిస్ వరల్డ్ పోటీలో బికినీని ఎప్పుడు ప్రవేశపెట్టారో తెలుసా..?

Oknews

రాత్రి వేళ ఈ పండ్లను తినొద్దని చెబుతున్న వైద్యులు.. ఎందుకంటే..?

Oknews

Leave a Comment