Health Care

ఎకో ఫ్రెండ్లీగా నిట్టింగ్ ఫ్యాషన్.. అల్లికలు, చేనేత వస్త్రాలకు పెరుగుతున్న ఆదరణ


దిశ, ఫీచర్స్ : పర్యావరణంపై ప్రతికూల ప్రభావం చూపేవాటిలో మోడర్న్ ఫ్యాషన్ అండ్ క్లాతింగ్ ఇండస్ట్రీ ఒకటి. దీని ద్వారా వెలువడే కాలుష్య కారకాలు, గ్రీన్ హౌస్ ఉద్గారాలు గ్లోబల్ వార్మింగ్ ఎఫెక్ట్‌ మరింత పెరిగేందుకు సహాయపడుతుందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఇప్పటికే యూరప్ దేశాల్లో హీట్‌వేవ్ పెరుగుతోంది. క్లైమేట్ చేంజ్ క్రైసిస్‌వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రపంచ పర్యావరణ అనుకూల, ప్రతికూల పోకడలపై డిస్కషన్ నడుస్తోంది. ముఖ్యంగా యూరప్‌ కంట్రీస్‌లో ఈ ఫాస్ట్ ఫ్యాషన్ బ్రాండ్స్‌పై వ్యతిరేకత పెరుగుతోంది. ప్రత్యామ్నాయంగా ప్రజలు చేనేత, అల్లికలు వంటి నిట్టింగ్ (knitting) ఫ్యాషన్‌పై ఫోకస్ చేస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఇటువంటి చర్యలు అవసరమని నిపుణులు చెప్తున్నారు.

హాబీగా మార్చుకోవాలంటున్న నిపుణులు

పర్యావరణ అనుకూల అల్లికలకు ఇటీవల ప్రయారిటీ పెరుగుతోంది. గతేడాది ఫ్రెంచ్ సిటీ అల్లికల ఉత్సవం పేరుతో పలు కార్యక్రమాలకు కూడా పిలుపునిచ్చింది. ప్రమాదకరమైన ఫ్యాషన్ ఇండస్ట్రీకి ప్రత్యామ్నాయంగా ఇప్పుడు అనేకమంది డిజైనర్స్, ప్రజలు ప్రత్యామ్నాయాల గురించి ఆలోచిస్తున్నారు. పైగా అల్లికలను ఒక హాబీగా మార్చుకోవడం ద్వారా వాతావరణానికి మేలు జరుగుతుందని భావిస్తున్నారు. ఇప్పటికే లండన్, న్యూయార్క్, పారిస్ అండ్ మిలన్ వంటి దేశాలు తమ క్యాట్‌వాక్ ట్రెడీషన్‌లోకి అల్లికలతో కూడిన దుస్తులను ప్రవేశ పెట్టాయి. ఇటాలియన్ లగ్జరీ హౌస్ ఫెండి కూడా తన 2024 సమ్మర్ కలెక్షన్‌లో నేత వస్త్రాలు, అల్లికల దుస్తులతో ఆకట్టుకుంటోంది. సోషల్ మీడియా కమ్యూనిటీస్, డిజిటల్ స్ఫేర్స్, నిట్టింగ్ క్రియేటర్స్ ఇన్‌ఫ్లూయెన్సర్స్‌గా మారుతూ పర్యావరణంపట్ల అవగాహన కల్పిస్తున్నారు. కాబట్టి ప్రజెంట్ యంగ్ జనరేషన్ కూడా స్టైలిష్ అండ్ యునిక్ ఫ్యాషన్ లుక్స్‌ను క్రియేట్ చేయడం ద్వారా అల్లికలను ఆహ్లాదకరమైన, అధునాతన పద్ధతిలో ఉపయోగిస్తున్నది.

ఎకో ఫ్రెండ్లీగా నయా ఫ్యాషన్

నిట్టింగ్ ఫ్యాషన్ చాలా వరకు పర్యావరణ అనుకూలంగా ఉంటుందని నిపుణులు చెప్తున్నారు. ఎందుకంటే ఇవి సహజంగా తయారు చేసే దుస్తులు, వస్తువులు మాత్రమే. కానీ మోడర్న్ ఫ్యాషన్ క్లాతింగ్‌లో చాలా రకాల కెమికల్స్ యూజ్ చేస్తారు. పైగా తయారీ సందర్భంగా గ్రీన్‌హౌస్ వాయువులు, విష పదార్థాలు విడుల అవుతాయి. అల్లిక దుస్తులవల్ల అటువంటి ప్రాబ్లం ఏదీ ఉండదు. చేనేత వస్త్రాలు, సొంతంగా దుస్తులు అల్లుకోవడం ద్వారా తయారీదారులు తాము ఉపయోగించే వాటిపై నియంత్రణ కలిగి ఉంటారు. మన్నిక కోసం ప్రకృతి ఆధారిత పదార్థాలను ఉపయోగిస్తారు. అల్లికలో యూజ్ చేసే ఫైబర్స్ సహజమైనవే కాకుండా సింథటిక్ ఫ్యాబ్రిక్‌ల కంటే ఎక్కువ నిలకడగా మారుస్తాయి. కాబట్టి తప్పకుండా పర్యావరణ అనుకూలత ఇందులో ఉంటుంది.

ఆకట్టుకుంటున్న నిట్టింగ్ ఫ్యాషన్‌

రకరకాల ఫ్యాషన్ వస్త్రాలు ప్రజలను ఆకర్షిస్తున్న ఈ రోజుల్లో అల్లికలు, చేనేత ద్వారా వచ్చే క్లాతింగ్స్ యూజ్ చేయడం, తయారు చేయడం కొంత కష్టంగా అనిపించవచ్చు. కానీ పర్యావరణానికి హాని జరుగుతున్నప్పుడు మనం మారాలి కదా అంటున్నారు నిపుణులు. పైగా ఇది ఎవరైనా ఈజీగా నేర్చుకోవచ్చు అంటున్నారు. అనేక సైట్లలో, ముఖ్యంగా యూట్యూబ్‌లో కూడా అల్లికలకు సంబంధించిన సమాచారం, స్టెప్ బై స్టెప్ ట్యుటోరియల్స్‌ను ఉంటున్నాయి. ఆల్ కమ్యూనిటీస్ అండ్ ఇండివిడ్యువల్స్ ఈ ప్రయోగాత్మక ప్రత్యక్ష కార్యాచరణలో నిమగ్నమైతే పర్యావరణానికి ఎంతో కొంత మేలు జరుగుతుందని శాస్త్రవేత్తలు చెప్తు్న్నారు. అంతేకాకుండా నిట్టింగ్ ఫ్యాషన్ లేదా అల్లిక ప్రజాదరణ పొందడమే కాకుండా అట్రాక్టివ్ ఫ్యాషనబుల్ ట్రెండ్‌గా మారుతుందని అంటున్నారు.



Source link

Related posts

Protein deficiency : మీ శరీరంలో ప్రోటీన్ లోపం ఉంటే కనిపించే లక్షణాలు ఏవో తెలుసా?

Oknews

‘చెవి, ముక్కు, గొంతు’ సమస్యలు రాకుండా ఉండాలంటే విడివిడిగా పలు జాగ్రత్తలు పాటించాల్సిందే!

Oknews

పొరపాటున కూడా మీ ఇంట్లో ఈ మొక్కలను, చెట్లను నాటకండి.. లేదంటే మీ జేబులు ఖాళీ !

Oknews

Leave a Comment