EntertainmentLatest News

ఎన్టీఆర్ ‘డ్రాగన్’ నుంచి రష్మిక అవుట్.. ఆమె వల్లే ఇదంతా!


‘దేవర’ (Devara), ‘వార్ 2’ (War 2) సినిమాలతో బిజీగా ఉన్న జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR).. తన తదుపరి సినిమాని ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో చేయనున్న సంగతి తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మించనున్న ఈ సినిమాకి ‘డ్రాగన్’ (Dragon) అనే టైటిల్ పరిశీలనలో ఉంది. కాగా ఈ మూవీలో హీరోయిన్ గా రష్మిక మందన్న (Rashmika) ఎంపికైనట్లు ఇటీవల వార్తలొచ్చాయి. ఎన్టీఆర్-రష్మిక మొదటిసారి జోడి కడుతున్నారన్న వార్తతో ఫ్యాన్స్ బాగానే ఎక్సైట్ అయ్యారు. అయితే ఇప్పుడు అనూహ్యంగా రష్మిక స్థానంలో మరో హీరోయిన్ పేరు వినిపిస్తోంది.

‘డ్రాగన్’లో ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ బ్యూటీ అలియా భట్‌ (Alia Bhatt) హీరోయిన్ గా నటించనున్నట్లు తెలుస్తోంది. ఇది ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి ఫుల్ కిక్కిచ్చే న్యూస్ అని చెప్పవచ్చు. ‘ఆర్ఆర్ఆర్’లో ఎన్టీఆర్, అలియా కలిసి నటించారు. అందులో ఆమె చరణ్ కి జోడిగా నటించినప్పటికీ.. ఆ సినిమా చిత్రీకరణ సమయంలో ఎన్టీఆర్, అలియా మంచి ఫ్రెండ్స్ అయ్యారు. ఆఫ్ లైన్ లో ఈ జోడికి ఎందరో ఫ్యాన్స్ ఉన్నారు. ఈ ఇద్దరు కలిసి జంటగా నటిస్తే బాగుంటుందని ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎప్పటినుంచో కోరుకుంటున్నారు. ఇప్పుడు ‘డ్రాగన్’ రూపంలో వారి కోరిక నెరవేరనుందని సమాచారం. నిజానికి ‘దేవర’లోనే అలియా నటించాల్సి ఉండగా, అప్పుడు ఆమె పెళ్లి కారణంగా కుదరలేదు.

ఆగస్టు లేదా సెప్టెంబర్ లో ‘డ్రాగన్’ షూట్ మొదలయ్యే అవకాశముంది. ఇందులో విలన్ గా బాలీవుడ్ యాక్టర్ బాబీ డియోల్ నటించనున్నాడని అంటున్నారు.



Source link

Related posts

Adilabad | PenGanga Festival | 130 ఏళ్లుగా జరుగుతున్న పెన్ గంగా జాతర చరిత్ర తెలుసా | ABP Desam

Oknews

This time it must be hit ఈసారి ఖచ్చితంగా కొట్టాల్సిందే

Oknews

ప్రేమికుల కోసం మరోసారి థియేటర్లలో ‘బేబీ’!

Oknews

Leave a Comment