EntertainmentLatest News

ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ మూవీ నుంచి క్రేజీ అప్డేట్!


సినిమా పరిశ్రమలో ఒక హీరో అండ్ ఒక దర్శకుడి కాంబినేషన్ లో సినిమా రావాలని సినీ ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తూ ఉంటారు. ఇంక ఆ హీరో అభిమానులు అయితే ఆ కాంబినేషన్ సెట్ అవ్వాలని తమ తమ ఇష్ట దైవాలకు పూజలు కూడా  చేస్తూ ఎప్పుడెప్పుడు ఆ ఇద్దరి సినిమా స్టార్ట్ అయ్యి కంప్లీట్ చేసుకుంటుందా ఎప్పుడెప్పుడు సిల్వర్ స్క్రీన్ మీద ఆ సినిమా చూస్తామా అనే  ఆశతో ఉంటారు. వాళ్ళు ఎవరి కాంబినేషన్లో సినిమా కోసం ఎదురు చూస్తున్నారో ఆ  కాంబినేషన్ లో సినిమా ప్రారంభం కాబోతుందని సినిమా మేకర్స్ అనౌన్స్ చేసారు.

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటనకి ఉన్న శక్తి ఎలాంటిందో అందరికి తెలుసు. మంచి కథ కుదరాలేగాని ఒంటి చేత్తో సినిమాని హిట్ చెయ్యగలిగే  కెపాసిటీ ఎన్టీఆర్ సొంతం. ఆయన చేసే డాన్స్, ఫైట్స్ కి ఎంత మంది అభిమానులు ఉన్నారో ఆయన పెర్ఫార్మెన్స్ కి  డైలాగ్స్ చెప్పే విధానానికి  కూడా అంతే మంది ఫాన్స్ ఉన్నారు. అచ్చ తెలుగులో డైలాగ్స్ చెప్తు విలన్స్ ని భయపెట్టడం ఎన్టీఆర్ స్పెషాలిటీ.  ఆయన ప్రస్తుతం దేవర సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఎన్టీఆర్ ఫాన్స్ మొత్తం ఎన్టీఆర్ నట తాండవాన్ని చూడటానికి దేవర సినిమా కోసం ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్నారు.ఇప్పుడు ఎన్టీఆర్ అభిమానులకి మరింత ఆనందం కలిగించే విషయం ఏంటంటే  ఎన్టీఆర్ అభిమానులు ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న ఒక క్రేజీ కాంబినేషన్ కి ముహూర్తం రెడీ అయ్యింది.

దేవర తర్వాత ఎన్టీఆర్ తన తదుపరి సినిమాని క్రేజీ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం లో చెయ్యబోతున్నాడు. అసలు ఎప్పటి నుంచో  ఈ ఇద్దరి కాంబినేషన్లో సినిమా ఉంటుందనే వార్తలు వచ్చాయి గాని  ఎవరు కూడా ఎక్కడ అధికారకంగా  ప్రకటించలేదు.అలాంటిది ఇప్పుడు ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ ల  కాంబినేషన్ లో వస్తున్న మూవీని ఎవరు నిర్మించబోతున్నారో కుడా తెలిసింది. హిట్ చిత్రాల నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ అండ్ ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా ఈ ప్రెస్టియజెస్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు .ఈ విషయాన్నీ ప్రముఖ సోషల్ మీడియా సంస్థ  ఎక్స్ వేదికగా ఎన్టీఆర్ ఆర్ట్స్ ప్రకటించింది. సోషల్ మీడియాలో ఈ పోస్ట్ చూసిన ఎన్టీఆర్ అభిమానులందరూ ఫుల్ ఖుషి తో ఉన్నారు.2024  ఏప్రిల్లో షూటింగ్ ప్రారంభం కాబోయే ఆ సినిమా పాన్ ఇండియా లెవెల్లో సంచలనం సృష్టించడం ఖాయం. కాగా ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర సినిమా షూటింగ్ లో బిజీ గా ఉన్నాడు..ప్రశాంత్ నీల్ సలార్ మూవీ  డిసెంబర్ 22 న విడుదల కాబోతుంది.పూర్తి స్క్రిప్ట్ కూడా పూర్తి చేసుకున్న ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ ల మూవీ ఎన్టీఆర్ దేవర షూటింగ్ ఎప్పుడు కంప్లీట్ చేసుకొని వస్తే అప్పుడు సినిమా షూటింగ్ ప్రారంభం అవుతుంది.



Source link

Related posts

మంచు మనోజ్ భార్య ప్రెగ్నెంట్.. ధైరవ్, నువ్వు నా ప్రాణం  

Oknews

సూర్య వర్సెస్ సూర్య.. ‘కంగువ’ మూవీ స్టోరీ ఇదే…

Oknews

Jagan decided to hit the elephant Kumbhasthal ముగ్గురిని ఓడించేందుకు మరో ముగ్గురు!

Oknews

Leave a Comment