EntertainmentLatest News

ఎన్టీఆర్ బొబ్బిలిపులి ని అలియా భట్ కాపీ కొడుతుందా! 


అగ్ర దర్శకుడు మహేష్ భట్ (mahesh bhatt)వారసురాలిగా సినీ రంగ ప్రవేశం చేసిన నటి అలియా భట్(alia bhatt)కెరీర్ లో ఎన్నో ఆటుపోట్లని ఎదుర్కొని అగ్ర హీరోయిన్ స్థానాన్ని సంపాదించింది. ఆర్ఆర్ఆర్ తో  తెలుగు ప్రేక్షకులని  కూడా తన నటనతో ఆకట్టుకుంది. తాజాగా ఒక కొత్త మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇప్పుడు ఆ మూవీ కథ వైరల్ గా మారింది.

అలియా భట్ మెయిన్ లీడ్ లో ప్రఖ్యాత సినీ నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిలిమ్స్ ఒక నూతన చిత్రాన్ని నిర్మిస్తుంది. పైగా అది ఇలాంటి ఇలాంటి  సబ్జెక్టు కాదు.స్ప్రై బేస్డ్ కధాంశంతో  రూపొందబోతుంది. ఆ  తరహా జోనర్ సినిమాలు నిర్మించడంలో యష్ సంస్థ  అగ్రగామి. ఇప్పటికే స్ప్రై సబ్జట్ తో కూడిన  చాలా సినిమాలని నిర్మించింది. కాకపోతే ఇప్పుడు లేడీ స్ప్రై ని నిర్మిస్తుండటం ఇదే తొలి సారి. ఈ  నెల 15 న ముంబైలో షూటింగ్ ప్రారంభం కాబోతుంది.  ఆ తర్వాత కాశ్మీర్ కి షిఫ్ట్ అవుతారు.ఎక్కువ భాగం అక్కడే  షూటింగ్ ని జరుపుకోనుంది. 

సాధారణంగా స్పై  కథ అనగానే మన శత్రుదేశమైన పాకిస్థాన్ మీద పోరాటం అని అనుకుంటాం.  కానీ ఈ కథ  మన అంతర్గత శత్రువులతో పోరాడే విధంగా  తెరకెక్కబోతుంది. దీంతో అలియా ఏ విధంగా పోరాటం చెయ్యబోతుందనే ఆసక్తి   అందరిలో ఉంది. సంచలన నటి శార్వరి వాగ్ కూడా  ప్రధాన పాత్ర పోషిస్తుంది. బాబీ డియోల్ విలన్ గా చేస్తుండగా అనిల్ కపూర్ ఒక ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు. ఇక ఇప్పుడు ఈ కథ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో సినీ ప్రేమికులు చాలా మంది గతంలో ఎన్టీఆర్ (ntr)నటించిన బొబ్బిలి పులి(bobbili puli)ని గుర్తుకు తెచ్చుకుంటున్నారు. దేశం లోపల ఉన్న అంతర్గత శత్రువులే ప్రమాదం అని చెప్పి ఎన్టీఆర్  వాళ్ళ మీద పోరాడతాడు.

 



Source link

Related posts

రాక రాక ఒక హిట్టొచ్చింది.. ఇప్పుడు ఫ్లాప్‌ డైరెక్టర్‌తో సినిమా చేస్తాడట?

Oknews

Kadiam Srihari instructions to CM Revanth Reddy in the assembly

Oknews

శంకర్‌కు భారీ షాక్‌.. ప్లేట్‌ ఫిరాయించిన నెట్‌ఫ్లిక్స్‌!

Oknews

Leave a Comment