EntertainmentLatest News

ఎమోషనల్‌ అయిన విజయ్‌ దేవరకొండ.. తన లవ్‌ సక్సెస్‌ అయిందట!


ప్రతివారం ఎన్నో సినిమాలు రిలీజ్‌ అవుతుంటాయి. అందులో కొన్ని హిట్‌ కావచ్చు, మరికొన్ని ఫ్లాప్‌ కావచ్చు. ఏ సినిమాకైనా ప్రేక్షకులు ఇచ్చేదే తుది తీర్పు. ఈ విషయంలో కొన్నిసార్లు అంచనాలు మారడం, హిట్‌ అవుతుందనుకున్న సినిమా ఫ్లాప్‌ అవ్వడం, పక్కా ఫ్లాప్‌ అనుకున్న సినిమాలు సూపర్‌హిట్‌ కావడం చాలా సందర్భాల్లో జరిగింది. ఫ్లాప్‌ అవుతుందనుకున్న సినిమా హిట్‌ అయితే అందరూ హ్యాపీనే. కానీ, సినిమా సూపర్‌హిట్‌ అవుతుంది అని ఎంతో కాన్ఫిడెన్స్‌తో వున్న యూనిట్‌కి అది ఫ్లాప్‌ అయితే వారు ఎంత షాక్‌కి గురవుతారో మాటల్లో చెప్పలేం. ఈ పరిస్థితి చాలా సినిమాలకు వచ్చింది. థియేటర్లలో రిలీజ్‌ అయి ఫ్లాప్‌ టాక్‌ తెచ్చుకున్న కొన్ని సినిమాలు డిజిటల్‌లో ఘన విజయం సాధించాయి. యూ ట్యూబ్‌లో రికార్డు స్థాయి వ్యూస్‌ని రాబట్టాయి. ఇప్పుడీ ప్రస్తావన రావడానికి కారణం విజయ్‌ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటించిన ‘డియర్‌ కామ్రేడ్‌’ సినిమా. 

2019లో విడుదలైన ‘డియర్‌ కామ్రేడ్‌’ చిత్రానికి భరత్‌ కమ్మ దర్శకత్వం వహించారు. ‘గీత గోవిందం’, ‘టాక్సీవాలా’ వంటి సూపర్‌హిట్‌ సినిమాల తర్వాత ‘డియర్‌ కామ్రేడ్‌’ రిలీజ్‌ అవ్వడం, ఈ సినిమాలో విజయ్‌ దేవరకొండ, రష్మిక మందన్న హీరోహీరోయిన్లు నటించడంతో సినిమాకి బాగా హైప్‌ వచ్చింది. ఎన్నో ఎక్స్‌పెక్టేషన్స్‌ మధ్య సినిమా రిలీజ్‌ అయి ఫ్లాప్‌ టాక్‌ తెచ్చుకుంది. అయితే ఓటీటీ, యూ ట్యూబ్‌, టీవీల్లో ఈ సినిమాకి మంచి ఆదరణ లభించింది. ముఖ్యంగా యూ ట్యూబ్‌లో ఇప్పటికే 400 మిలియన్‌ వ్యూస్‌ని క్రాస్‌ చేసింది ‘డియర్‌ కామ్రేడ్‌’. 

ఈ నేపథ్యంలో విజయ్‌ దేవరకొండ ‘డియర్‌ కామ్రేడ్‌’ గురించి స్పందిస్తూ ఈ సినిమా రిలీజ్‌ అయిన రోజు తను ఎంత బాధపడ్డానో తనకే తెలుసు అన్నారు. ఎంతో ఇష్టపడి చేసిన సినిమా, తనకెంతో నచ్చిన కథతో చేసిన సినిమాకి వచ్చిన రిజల్ట్‌ చూసి షాక్‌ అయ్యాడట. ఇప్పుడు యూట్యూబ్‌లో వస్తున్న వ్యూస్‌ చూసి చాలా ఎమోషనల్‌ అయ్యారు. ‘డియర్‌ కామ్రేడ్‌’తో తను లవ్‌లో పడ్డానని, రిలీజ్‌ తర్వాత షాక్‌ అయినా, ఇప్పుడు యూ ట్యూబ్‌లో వ్యూస్‌ చూసిన తర్వాత తన లవ్‌ సక్సెస్‌ అయ్యిందన్న ఫీలింగ్‌ కలుగుతోందంటున్నారు విజయ్‌ దేవరకొండ. 



Source link

Related posts

పాము విషంతో పార్టీ ఏర్పాటు చేశాను.. ఒప్పుకున్న బిగ్ బాస్ ఓటిటి విజేత  

Oknews

రజనీకాంత్ పై కమల్ హాసన్ కీలక వ్యాఖ్యలు.. అసూయ ఉందంటారా

Oknews

ప్రభాస్‌ సినిమాలో ఛాన్స్‌ కొట్టేసిన అక్కడి టాప్‌ హీరోయిన్‌!

Oknews

Leave a Comment