EntertainmentLatest News

ఎలక్షన్ మూవీ రివ్యూ


 


మూవీ : ఎలక్షన్

నటీనటులు: విజయ్ కుమార్, ప్రీతీ అస్రానీ, రిచా జోషీ, జార్జ్ మరియన్, పావెల్ నవగీతన్,  దిలీపన్ తదితరులు

ఎడిటింగ్: సి.ఎస్ ప్రేమ్ కుమార్

మ్యూజిక్: గోవింద్ వసంత

సినిమాటోగ్రఫీ: మహేంద్రన్ జయరాజన్

నిర్మాత: ఆదిత్య

కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: తమిజ్

ఓటీటీ: ప్రైమ్ వీడియో

కథ: 

తమిళనాడు పరిసర ప్రాంతంలో మెయిన్ రోడ్డు పక్కన గల ఓ దాబాలో ఒకతను తినేసి బయల్దేరుతుండగా.. అతని వ్యాన్ టైర్ చూసుకుంటాడు. దానిని ఎవరో పంచర్ చేశారని భావించి.‌. లోపల ఉన్న తన మనుషులకి మనల్ని ఎవరో చుట్టుముట్టారని జాగ్రత్తగా ఉండంటి అని కత్తులు ఇస్తాడు. ఇక అదే సమయంలో రాజ్ వచ్చి వారిని చావగొడతాడు. రాజ్ వాళ్ళ నాన్న నెల్సన్ తమిళనాడులోని ఓ పార్టీలో పనిచేస్తుంటాడు. తన నలభై ఏళ్ళ రాజకీయ జీవితంలో ఒక్క పదవి కూడా ఆశించకుండా మంచి పేరు మాత్రమే తెచ్చుకున్నాడు. నెల్సన్ కి తడికాచలం అనే క్లోజ్ ఫ్రెండ్ ఉంటాడు. అతనికి జరగబోయే ఎన్నికల్లో కౌన్సిలర్ అవ్వాలనే ఆశ ఉంటుంది. ఆయన కూతురు సెల్వి.. తను నెల్సన్ కొడుకు రాజ్ ప్రేమించుకుంటారు. అయితే సెల్వి వాళ్ళ నాన్న విదేశాలలో ఉండే వేరే అతనికి పెళ్లి ఫిక్స్ చేస్తాడు. మరి రాజ్ ఏం చేశాడు? అసలు నెల్సన్ ని తడికాచలం ద్వేషించడానికి కారణం ఏంటి? రాజ్, సెల్విల ప్రేమలో ఎలక్షన్ పాత్ర ఎంతవరకు ఉందనేది మిగతా కథ.

విశ్లేషణ:

సినిమా ఆరంభంలో ఎలక్షన్ గురించి వివరించిన తీరు బాగుంది. ఆ తర్వాత దాబాలో కొంతమంది రౌడీలని రాజ్ కొడుతూ తన ఫ్లాష్ బ్యాక్ చెప్పడం ఆసక్తిగా అనిపిస్తుంది. 

సినిమా మొదటి అరగంట బాగుంటుంది. ఇక అక్కడి నుండి మాములు బోరింగ్ కాదు‌. ఈ మూవీకి టైటిల్ ఎలక్షన్  అని కాకుండా ఎలిమినేషన్ అని పెడితే బాగుండేది. ఫ్యామిలీతో చూడొచ్చా అంటే చూడొచ్చు.. అడల్ట్ కంటెంట్ ఏం లేదు. ఊర్లో జరిగే ఎలక్షన్ లో అపోజిట్ పార్టీ మీద హీరో నిలబడి, వారితో శపథం చేయడం, డబ్బులు పంచడం‌.. అన్నీ మనం నిత్యం బయట చూసేవే కనిపిస్తుంటాయి. కొత్తదనం ఏం లేదు. 

ఇంటర్వెల్ వరకు కష్టంగా సాగిందే తర్వాత అయిన బాగుందా అని మొదలెడితే వామ్మో అనేంతలా మళ్లీ అవే సీన్లు రిపీట్ మోడ్ లో చూసినట్టుగా ఉంటుంది. కావాలని క్రియేట్ చేసినట్టుగా ట్విస్ట్, ఎందుకు రా బాబు అనిపించేలా పాటలు, హీరోయిన్ ఎందుకు ఉందో చూసేవారికి అర్థం కాదు. సినిమా చూస్తున్నంతసేపు హీరోని చూస్తుంటే ఏదో గెస్ట్ క్యారెక్టర్ లా అనిపిస్తుంది.  రాజకీయ డ్రామాని ఇష్టపడేవారికి నచ్చే సీన్లు కూడా ఏమీ లేవు. 

సినిమాలో ఒక్కటంటే ఒక్కటి కూడా హై మూమెంట్ లేదు. సెకెంఢాఫ్ లో హీరో క్యారెక్టర్ ని పూర్తిగా డౌన్ చేసేశారు. బోరింగ్ ప్రొసీడింగ్స్. నిడివి అంత ఉండాల్సిన అవసరం లేదు. సి.ఎస్ ప్రేమ్ కుమార్ ఎడిటింగ్ పర్వాలేదు.  గోవింద్ వసంత మ్యూజిక్ ఒకే.  మహేంద్రన్ జయరాజన్ సినిమాటోగ్రఫీ ఆకట్టుకుంటుంది. నిర్మాణ విలవలు బాగున్నాయి. 

నటీనటుల పనితీరు:

సెల్విగా రీచా జోషి, రాజ్ పాత్రలో విజయ్ కుమార్ ఆకట్టుకున్నారు. ప్రీతీ అస్రానీ, జార్జ్ మరియన్, పావెల్ నవగీతన్ తమ పాత్రలకి న్యాయం చేశారు.

ఫైనల్ గా :

ఓపికకి పనిచెప్పే ఈ సినిమాకి చూడకపోవడమే బెటర్‌. చూడటానికి మరే సినిమా లేకపోతే ఈ సినిమాని ఒక్కటంటే ఒక్కసారే చూడొచ్చు. 

రేటింగ్: 2 / 5


✍️. దాసరి మల్లేశ్

 



Source link

Related posts

Upcoming OTT Releases This Week ఈ వారం క్రేజీ ఓటిటి చిత్రాల డిటైల్స్

Oknews

'స్కంద' ఫస్ట్ రివ్యూ.. క్లైమాక్స్ ట్విస్ట్ కి పూనకాలే!

Oknews

It is a war with BJP..! బీజేపీతో ఇక యుద్ధమే..!

Oknews

Leave a Comment