EntertainmentLatest News

ఎవరు సూర్యకి తెలుగునాట అభిమానులు లేదంది..ఫ్యాన్స్ రచ్చ చూసారా


దశాబ్దంన్నర క్రితమే సౌత్ సూపర్ స్టార్ గా అవతరించిన హీరో సూర్య(suriya)తెలుగు నాట కూడా ఫుల్ క్రేజ్ ఉంది. ఇందుకు నిదర్శనమే  కొన్ని నెలల క్రితం రీ రిలీజ్ అయిన సూర్య సన్ ఆఫ్ కృష్ణన్.  2008 లో వచ్చిన  ఆ మూవీకి  థియేటర్స్ లో  వఛ్చిన రెస్పాన్స్ అంతా ఇంతా కాదు.ఇక ఫ్యాన్స్ అయితే రచ్చ రంబోలా చేసిపడేసారు. ఇక ఈ రోజు సూర్య బర్త్ డే. ఈ సందర్భంగా తన అభిమానులకి ఊహించని ట్రీట్ ఒకటి వచ్చింది.

సూర్య అప్ కమింగ్ మూవీ కంగువా(kanguva)సూర్య కెరీర్ లో నలభై మూడవ సినిమా. వరల్డ్ వైడ్ గా అక్టోబర్ పది న విడుదల కాబోతుంది. ఆల్రెడీ  టీజర్ కూడా వచ్చి సినిమా మీద అంచనాలని ఆమాంతం పెంచేసింది.సూర్య అభిమానులతో పాటు  పాన్ ఇండియా ప్రేక్షకులు మొత్తం కంగువా కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు దీని తర్వాత కార్తీక్ సుబ్బరాజ్(karthik subbaraj) దర్శకత్వంలో ఒక మూవీ చేస్తున్నాడు. సూర్య నుంచి వస్తున్న 44 వ చిత్రమిది. ఆల్రెడీ షూట్ లోనే ఉంది. ఇప్పుడు ఈ మూవీ నుంచి  సూర్య బర్త్ డే సందర్భంగా గ్లింప్స్  రిలీజ్ అయ్యింది. ఇలా రిలీజ్ అయ్యిందో లేదో సోషల్ మీడియాని షేక్ చేస్తుంది.  ప్రేమ, నవ్వు, యుద్ధం అనే మూడు అంశాలతో తెరకెక్కుతున్నట్టు ప్రకటించారు. ఇక సూర్య లుక్ గత చిత్రాలతో పోలిస్తే చాలా  డిఫరెంట్ గా ఉంది.  ఫ్యాన్స్ నుంచి ఇప్పుడు ఆ లుక్ కి సూపర్ రెస్పాన్స్ వస్తుంది. అదే విధంగా రాయల్ ఎస్టేట్ అనే బోర్డు  చూపించి బయట కొంత మంది  కాపలాగా ఉండటం చూపించారు.  సూర్య చేతిలో రివాల్వర్ తో పాటు  ముఖం మీద రక్తపు మరకలు చూస్తుంటే సూర్య రౌడీగా చేస్తున్నాడనే విషయం అర్ధమవుతుంది. అలాగే మాస్ ప్రేక్షకులకి పండగ అని చెప్పవచ్చు.

 

ఇక హీరోయిన్ గా బుట్టబొమ్మ పూజ హెగ్డే(pooja hegde)చేస్తుండగా టూ డి ఎంటర్ టైన్మెంట్స్ పై సూర్య అండ్ జ్యోతిక లు  రాజశేఖర్, కార్తికేయన్ లతో  కలిసి  అత్యంత భారీ వ్యయంతో నిర్మిస్తున్నారు. ప్రస్తుతం అండమాన్ ఐలాండ్ లో షూటింగ్ జరుగుతుంది. వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చెయ్యాలనే ప్లాన్ లో యూనిట్ ఉంది. జోజు జార్జ్, జయరాం లు ముఖ్య పాత్రల్లో  చేస్తుండగా సంతోష్ నారాయణ్ సంగీతాన్ని అందిస్తున్నాడు.

 



Source link

Related posts

శ్రీరామనవమికి రామాయణ మూవీ ఫెస్టివల్.. సీతగా సాయి పల్లవి 

Oknews

Nikhil Shares His Wife Pallavi BabyShower Pic సీమంతంతో.. నిఖిలే రివీల్ చేశాడు

Oknews

Allu Arjun Fires On Fake Posts and Fake Fans Activities

Oknews

Leave a Comment