ఆస్కార్ అవార్డు గ్రహీత ఎ.ఆర్.రెహమాన్ గతంలో కొన్ని వివాదాల్లో ఇరుక్కున్న విషయం తెలిసిందే. తాజాగా మరో కొత్త వివాదం రెహమాన్‌ను వేధిస్తోంది. అదేమిటంటే.. అసోసియేషన్ ఆఫ్ సర్జన్స్ ఆఫ్ ఇండియా.. ఎ.ఆర్.రెహమాన్‌పై ఫిర్యాదు చేసింది. తమ అసోసియేషన్ తరఫు నుంచి రూ.29 లక్షలు తీసుకొని అగ్రిమెంట్ చేసుకున్న రెహమాన్ దానికి తగ్గట్టుగా కాన్సర్ట్ చేయలేదని ఆ సంస్థ ఆరోపించింది. చిన్నగా ప్రారంభమైన ఈ వివాదం ఇప్పుడు పెద్దదిగా మారడంతో రెహమాన్ తన న్యాయవాదిని సంప్రదించారు.
దీనిపై స్సందించిన రెహమాన్ న్యాయవాది.. తన క్లయింట్‌పై నమోదు చేసిన కేసును మూడు రోజుల్లోగా ఉపసంహరించుకోవాలని కోరారు. అంతేకాదు, తన క్లయింట్ ప్రతిష్టను దెబ్బతీసే ప్రయత్నం చేసిన వైద్యుల సంఘం రూ.10 కోట్ల పరువు నష్టం చెల్లించాలని డిమాండ్ చేశారు. వైద్యులు రెహమాన్‌పై చేసిన ఆరోపణల్లో నిజం లేదని, దీని వెనుక థర్డ్ పార్టీ జోక్యం ఉందని తెలిపారు. ఈ విషయంలో రెహమాన్‌కు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని వైద్యుల సంఘాన్ని రెహమాన్ తరఫు న్యాయవాది కోరారు.