Top Stories

ఏడాదిలో బాక్సాఫీస్ వ‌సూళ్లు.. ఏ భాష వాటా ఎంత‌?


గ‌త ఏడాది ఇండియ‌న్ బాక్సాఫీస్ స్టామినా 12,226 కోట్ల రూపాయ‌లు అని చెబుతున్నాయి వ‌సూళ్ల లెక్క‌ల‌న్నీ క‌లిపి! 2023లో ఇండియాలో మొత్తం సినిమా టికెట్ల అమ్మ‌కం విలువ 12,226 కోట్ల రూపాయ‌ల‌ట‌. ఇది 2022 క‌న్నా కాస్త ఎక్కువ‌. 2022లో 12 వేల కోట్ల రూపాయ‌ల వ‌సూళ్లు ద‌క్కితే, ఇండియ‌న్ సినిమాల‌కు 2023లో ఒక రెండు వంద‌ల కోట్ల రూపాయ‌ల అద‌న‌పు వ‌సూళ్లు ద‌క్కాయ‌ని ఈ గ‌ణాంకాలు చెబుతున్నాయి.

మ‌రి ఈ ప‌న్నెండు వేల కోట్ల రూపాయ‌ల పై చిలుకు మొత్తంలో మెజారిటీ వాటా మాత్రం బాలీవుడ్ సినిమాల‌దే! హిందీ సినిమాలు మొత్తం క‌లిపి 5,380 కోట్ల రూపాయ‌ల వ‌సూళ్ల‌ను సాధించాయట‌! మిగ‌తా వాటా ఇత‌ర భాష‌ల సినిమాల‌ది.  మొత్తం వ‌సూళ్ల‌లో హిందీ సినిమాల బాక్సాఫీస్ వాటా 44 శాతం. అంత‌కు ముందు ఏడాది ఇది 33 శాతం ఉండేది. గ‌త ఏడాది హిందీ చిత్ర‌ప‌రిశ్ర‌మ 11 శాతం వాటాను పెంచుకుని ప్రీ కోవిడ్ స్థాయిని అందుకుంది.

హిందీ చిత్ర‌ప‌రిశ్ర‌మ త‌ర్వాత తమిళ‌, తెలుగు సినిమాలు మెజారిటీ వాటాను క‌లిగి ఉన్నాయి. ఆ త‌ర్వాత  హాలీవుడ్ సినిమాల వాటా 9 శాతం ఉంది. 2022లో హాలీవుడ్ సినిమాల వాటా 12 శాతం కాగా, 2023 నాటికి 9కి త‌గ్గింది. అలాగే క‌న్నడ చిత్ర ప‌రిశ్ర‌మ 2022లో ఎనిమిది శాతం వాటాను క‌లిగి ఉండ‌గా, గ‌త ఏడాది అది మూడుకు ప‌డిపోయింది!

హీరోల వారీగా చూస్తే.. మొత్తం క‌లెక్ష‌న్ల‌లో షారూక్ వాటా సోలోగా పెద్ద‌ది! గ‌త ఏడాది షారూక్ సినిమాలు మూడు విడుద‌ల అయ్యాయి. జ‌వాన్, ప‌ఠాన్, డంకీ రూపంలో షారూక్ సినిమాలు మొత్తం 1,622 కోట్ల రూపాయ‌ల వ‌సూళ్ల‌ను సాధించాయి. 



Source link

Related posts

రిపబ్లిక్ డే ఎఫెక్ట్.. సంక్రాంతి సినిమాలకు సెగ

Oknews

సెన్సార్ సర్టిఫికేట్ కోసం లంచం ఇచ్చిన హీరో

Oknews

దేవర 2 భాగాలు.. ప్రశాంత్ నీల్ ముందు జాగ్రత్త

Oknews

Leave a Comment