GPS Gazette Notification : సీపీఎస్ రద్దు, ఓపీఎస్ అమలు చేయాలని ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులు డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే సీపీఎస్ రద్దు అసాధ్యమని తేల్చిచెప్పిన ప్రభుత్వం… ఓపీఎస్ స్థానంలో జీపీఎస్(గ్యారంటీడ్ పింఛన్ స్కీమ్) రూపొందించింది. జీపీఎస్ బిల్లును ఇటీవల అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వం ఆమోదించింది. తాజాగా ఈ బిల్లుకు గవర్నర్ ఆమోదం తెలపడంతో.. జీపీఎస్ అమల్లోకి వచ్చినట్లు రాష్ట్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. జీపీఎస్ పై ఉద్యోగుల్లో భిన్న అభిప్రాయాలు ఉన్నాయి.