వెబ్ ఆప్షన్ కీలకం
ఏపీ ఈఏపీసెట్‌లో వచ్చిన ర్యాంక్ ఆధారంగా బీటెక్ ఇంజినీరింగ్ కోర్సుల్లో సీట్ల కేటాయింపు ఉంటుంది. వెబ్ ఆప్షన్‌లో ఇచ్చిన కాలేజీ, బ్రాంచ్‌లకు ర్యాంక్ ఆధారంగా సీట్లు కేటాయింపు ఉంటుంది. ఉన్నత విద్యా మండలి అధికారిక వెబ్ ఆప్షన్‌కు డైరెక్ట్ లింక్ https://eapcet-sche.aptonline.in/EAPCET/weboptions ఇది. దీనిపై క్లిక్ చేయాలి. అక్కడ హాల్ టిక్కెట్టు నంబర్, పుట్టిన తేదీ ఎంటర్ చేయాలి. అప్పుడు లాగిన్ అవుతుంది. ప్రాధాన్య క్రమంలో కోర్సు, కాలేజీలను ఎంపిక చేసుకోవాలి. ప్రాధాన్య క్రమంలో ఎంపిక పూర్తి అయితే, దాన్ని సేవ్ చేసి, సబ్మిట్ చేయాలి. రాష్ట్రంలో మొత్తం 232 ఇంజినీరింగ్ కాలేజీలకు ప్రభుత్వం అనుమతి ఇస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. ఇందులో 24 ప్రభుత్వ యూనివర్సిటీ కాలేజీలు కాగా, 208 ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీలు ఉన్నాయి.